తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో విక్టరీ వెంకటేష్( Venkatesh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరో వెంకటేష్ ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరుచుకున్నాడు వెంకటేష్.హీరో వెంకటేష్ ఎక్కువ శాతం సినిమాలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ తెలియజేశాడు.
అందుకే ఇప్పటికి వెంకటేష్ సినిమా విడుదల అవుతుంది అంటే మగవారికి అంటే ఎక్కువగా లేడీ ఫ్యాన్స్ థియేటర్ దగ్గర కనిపిస్తూ ఉంటారు.ముఖ్యంగా ఫ్యామిలీలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

ముఖ్యంగా చెప్పాలి అంటే వెంకటేష్ కి ఉన్నంత ఫ్యామిలీ హీరో మరి హీరోకి లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.30 ఏళ్లుగా కష్టపడి మంచి గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ ఒకే ఒక్క వెబ్ సిరీస్ తో చల్లా చెదురు చేసుకున్నాడు.వెంకటేష్ కి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ అంతా కూడా డ్యామేజ్ అయింది.రానా నాయుడు( Rana naidu , ) వెబ్ సిరీస్ లో హీరో వెంకటేష్ రానా బోల్డ్ నెస్( Rana ) చూసి తెలుగు ప్రేక్షకులు షాక్ అయ్యారు.
ఈ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత దాదాపుగా పది రోజులు వరకు అందులోని బూత్ సన్నివేశాల గురించి మాట్లాడుకున్నారంటే ఈ రేంజ్ లో విమర్శల పాలయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

మరి ముఖ్యంగా మొదట్లో అయితే బ్లూ ఫిలిం లానే ఉందనే విమర్శలు విపరీతంగా వినిపించాయి.ఈ వెబ్ సిరీస్ విడుదల తర్వాత రానా పై అలాగే హీరో వెంకటేష్ పై దారుణంగా ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా రానా నాయుడు 2 అనౌన్స్ ని చేసింది.
దీక్షకులు మొదటి సీజన్ ఏ చూడడానికి ఇష్టపడడం లేదు అంటే ఇప్పుడు రెండవ సీజన్ కమింగ్ సూన్ అంటూ నెట్ ఫ్లిక్స్ ఒక ట్వీట్ చేయడంతో వీడియోని కూడా విడుదల చేసింది.

ఒకవేళ ఈ సిరీస్ ను రిలీజ్ చేయాలి అనుకుంటే అడల్ట్ కంటెంట్ తగ్గించాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.కొంతమంది వెంకటేష్ రాణాలకు పరువు పోయిన ఇంకా మారలేదా.ఇంకా ఎందుకు ఆ ప్రాజెక్ట్ ని పట్టుకుని వేలాడుతున్నారు ఆ ప్రాజెక్టు మీకు అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు.







