2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్, బైడెన్‌లపై హిల్లరీ క్లింటన్ సంచలన వ్యాఖ్యలు

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు( US 2024 Elections ) సంబంధించి డెమొక్రాటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్( Hillary Clinton ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) గెలవరని.

 Hillary Clinton Targets Trump Ahead Of Us 2024 Elections Details, Hillary Clinto-TeluguStop.com

రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ఎవరైనప్పటికీ జో బైడెన్( President Joe Biden ) మరోసారి ఎన్నికవుతారని ఆమె జోస్యం చెప్పారు.ట్రంప్ ప్రవర్తనపై చాలా మంది విసుగెత్తిపోయారని క్లింటన్ అన్నారు.

వ్యాపారంలో ట్రంప్ విజయవంతమయ్యారని.కానీ రాజకీయాల్లో మాత్రం అతను సక్సెస్ కాలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ట్రంప్ నియమాలను పట్టించుకోని వ్యక్తని, కనీసం చట్టానికి కూడా గౌరవం ఇవ్వడని హిల్లరీ క్లింటన్ దుయ్యబట్టారు.

నగదు చెల్లింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడానికి అమెరికా న్యాయవ్యవస్థ ఏమి చేయదని హిల్లరీ వ్యాఖ్యానించారు.

రిపబ్లిక్ పార్టీ నామినేషన్ పొందినా.తన దృష్టిలో అతను తిరిగి గెలవలేడని ఆమె పేర్కొన్నారు.రిపబ్లిక్ పార్టీ నామినేషన్ గెలవడానికి కావాల్సిన మద్ధతు ట్రంప్‌కు వుందని.కానీ అధ్యక్షుడయ్యేది మాత్రం బైడెనే అని హిల్లరీ క్లింటన్ కుండబద్ధలు కొట్టారు.

Telugu Democratic, Floridagovernor, Hillary Clinton, Joe Biden, Republic, Trump,

ఇకపోతే.రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డి శాంటిస్‌పైనా హిల్లరీ క్లింటన్ స్పందించారు.అతను కూడా విఫలమవుతాడని ఆమె జోస్యం చెప్పారు.ఫ్లోరిడా వెలుపల ఎవరికీ అతని గురించి పెద్దగా తెలియదన్నారు.ఫ్లోరిడాలో ఇప్పటికే అతని వెర్రి పనులు చూస్తున్న వారు వున్నారని.అందువల్ల రిపబ్లికన్ పార్టీ నామినీ ఎవరన్న దానితో సంబంధం లేకుండా అధ్యక్షుడిగా బైడెన్ మరోసారి తిరిగి తెలుస్తారని హిల్లరీ క్లింటన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Telugu Democratic, Floridagovernor, Hillary Clinton, Joe Biden, Republic, Trump,

అలాగే అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో బైడెన్ చాలా పెద్ద వయస్కుడని, 2024 నాటికి మరింత వయసు పెరుగుతుందని జరుగుతున్న ప్రచారంపైనా హిల్లరీ స్పందించారు.తనకు కూడా 70 ఏళ్లు దాటిందని.తానైనా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించగలనని హిల్లరీ క్లింటన్ తేల్చిచెప్పారు.ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు అమెరికన్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube