30 గంటల బాధను భరిస్తూ టాటూ వేయించుకున్న తండ్రి..! ఎందుకంటే?!

కెనడాలో ఒక తండ్రి తన కొడుకు కోసం భరించలేని నొప్పిని 30 గంటల పాటు భరించి వార్తల్లోకి ఎక్కాడు.

పూర్తి వివరాలు తెలుసుకుంటే అల్బెర్టా స్టోనీ ప్లెయిన్‌ ప్రాంత నివాసి అయిన డెరెక్ ప్రూ సీనియర్ కు ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు.

ఆ కొడుకు పేరు డెరాక్ జూనియర్ కాగా.తన కొడుకును ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నాడు తండ్రి.

ఐతే తన కుమారుడి మనసులో ఆత్మవిశ్వాసం పెంచడానికి తండ్రి అతి క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నారు.తన కుమారుడి ఛాతీ పై పుట్టినప్పుడే ఓ పెద్ద మచ్చ ఉండగా అది ప్రస్తుతం మరింత పెరిగిపోయింది.

దీంతో స్విమింగ్ కి వెళ్ళినా.మరే ఇతర కార్యక్రమానికి వెళ్లిన షర్ట్ విప్పడానికి తన కుమారుడు బాగా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు.

Advertisement

అయితే తన కుమారుడికొక్కడికే అటువంటి మచ్చలేదని.మచ్చ ఉన్నంత మాత్రాన ఆత్మన్యూనతా భావానికి లోనుకాకూడదని చెప్పడానికి తండ్రి తన కొడుకు శరీరంపై ఉన్న మచ్చను పోలిన టాటూ ని వేయించుకున్నారు.అందు కోసం అతను ఏకంగా ఎనిమిది వారాల పాటు.30 గంటలు బాధ భరిస్తూ టాటూ వేసుకున్నాడు."టాటూ వేయించుకునే టప్పుడు ఎంతో బాధ కలిగినప్పటికీ నా కొడుకు కోసం నేను భరించాను.

నా చాతి పై కూడా పచ్చబొట్టు పొడిపించుకుని నా కుమారుడికి ఆత్మస్థైర్యం నింపుతున్న అందుకుగాను నాకు చాలా సంతోషంగా ఉంది.ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళినా షర్టు విప్పి ధైర్యం గా నిల్చో గలం" అని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ తండ్రి తన కొడుకు కోసం చేసిన గొప్ప కార్యం అందరి ప్రశంసలను అందుకుంది.సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ తండ్రిని నెటిజన్లు బాగా కొనియాడుతున్నారు.టాటూ వేస్తున్న సమయంలో నొప్పి తగ్గించుకోవడానికి డెరెక్ ప్రూ సీనియర్ పలు సార్లు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు.

ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)
Advertisement

తాజా వార్తలు