SBI పేరుతో ఏర్పాటు చేసిన నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు..

SBI పేరుతో ఏర్పాటు చేసిన నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు.14 మంది అరెస్ట్.దేశ వ్యాప్తంగా ఈ ముఠా పై 209 కేసులు.SBI కాల్ సెంటర్ నుండి కాల్ చేస్తున్నామని క్రెడిట్ కార్డు ఖాతాదారులను మోసం చేసిన ముఠా.సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ… ఫేక్ SBI కాల్ సెంటర్ గుట్టురట్టు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు. డిల్లీ లోని ఉత్తమ్ నగర్ కేంద్రం గా దేశ వ్యాప్తంగా అమాయక ప్రజలను చీట్ చేసి కోట్లు కొల్లగొట్టారు.

 Cyberabad Police Arrest Fake Call Center In The Name Of Sbi Details-TeluguStop.com

దేశంలోని అతి పెద్ద సైబర్ క్రైం.కాల్ సెంటర్ నుండి 33 వేల కాల్స్ చేశారు.209 కేసులు నమోదు.

దేశ వ్యాప్తంగా 5 వేల పైన కేసులు ఉండవచ్చు.

అన్ని రాష్ట్రాల పోలీసులు ఈ గ్యాంగ్ కోసం వెతుకుతున్నారు.ఒక కారు, 15 బైక్ లు, 30 మొబైల్స్, లాప్ టాప్ లు సీజ్.

టెలి కాలర్స్ ద్వారా కాల్ చేయిస్తారు.A 1 నిఖిల్ మదాన్ ఈ ఫేక్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు.

A 13 ఫర్మాన్ హుస్సేన్ నకిలీ కాల్ సెంటర్ లకు డీటెయిల్స్ ఇస్తాడు.కాల్ సెంటర్ లో పదిమంది పనిచేస్తారు మిగతా వారు బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేస్తారు.

18601801290 టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కాల్ చేస్తారు.పాత కార్డులు రీప్లేస్ చేస్తామని, క్రెడిట్ లిమిట్ పెంచుతామని కార్డు డీటెయిల్స్ తీసుకుని మోసం.

నో బ్రోకర్, హౌసింగ్ డాట్ కామ్ వెబ్ సైట్ల లో లింకు లు పంపుతారు.గత సంవత్సరం నుంచి ఈ దందా నడుస్తోంది.డైరెక్ట్ సేల్ ఏజెన్సీ అనే ధర్డ్ పార్టీ ద్వారా ఖాతాదారుల డీటెయిల్స్ తీసుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube