ఈనెల 15 నుంచి 17 వరకు సీడబ్ల్యూసీ సమావేశాలు..: భట్టి

ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.ఈ సమావేశంలోనే కాంగ్రెస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.

 Cwc Meetings From 15th To 17th Of This Month..: Bhatti-TeluguStop.com

సోనియా గాంధీ చారిత్రక డిక్లరేషన్ ను ప్రకటిస్తారని భట్టి పేర్కొన్నారు.ఈ నెల 17న హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ సభకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.

కొద్ది మంది బీఆర్ఎస్ నేతల చేతుల్లో సంపద చేరిపోయిందని ఆరోపించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అవినీతిపై ఛార్జ్ షీట్ ప్రకటిస్తామని తెలిపారు.

ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని వెల్లడించారు.బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకే వెళ్తుందని విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube