ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఎజెండాగా సీడబ్ల్యూసీ భేటీ..: కేసీ వేణుగోపాల్

ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఎజెండాగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.

మణిపుర్ అంశంపై కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ గేమ్ చేంజర్ గా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని కేసీ స్పష్టం చేశారు.కరెప్షన్ గురించి బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు.

అవినీతికి ఎవరు పాల్పడుతున్నారో ప్రజలకు తెలుసని చెప్పారు.కాగా ఇవాళ, రేపు రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణా వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.

అనంతరం తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఉండనుంది.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు