గున్న ఏనుగుపై మొసలి దాడి.. ప్రాణాలకు తెగించి పోరాడిన తల్లి ఏనుగు

తల్లి తన పిల్లల పట్ల చూపే ప్రేమ, సంరక్షణ, ఆప్యాయతకు కొలవలేం.అందుకే ఈ సృష్టిలో తల్లికి ఉండే విలువ మరే ఇతర వాటితో పోల్చలేం.

మనుషులైనా జంతువులైనా తల్లి ప్రేమ( Mothers Love ) ఒకేలా ఉంటుంది.తన బిడ్డలకు ఏ మాత్రం ఆపద వచ్చినా తల్లి తట్టుకోలేదు.

అవసరమైతే తన ప్రాణాలు పణంగా పెట్టి, తన బిడ్డలను రక్షించుకుంటుంది.మనుషులలోనే కాకుండా ఇదే తరహాలో పిల్లల పట్ల జంతువులు కూడా ప్రేమ చూపుతాయి.

దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఓ ఘటన జరిగింది.మొసలి ( Crocodile ) బారిన పడిన గున్న ఏనుగును తల్లి ఏనుగు( Mother Elephant ) తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షించుకుంది.

Advertisement

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.జంతువులకు సంబంధించిన ఆ వీడియోలు మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తాయి.చాలా స్పూర్తిని అందిస్తాయి.

తాజాగా ఆయన ఓ ఏనుగు సాహసోపేత చర్యతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు.అందులో ఓ కొలనులో పిల్ల ఏనుగు జలకాలాటలు ఆడుతూ ఉంటుంది.

దానితో పాటే దాని తల్లి ఏనుగు కూడా అక్కడే ఉంటుంది.ఇంతలో కొలనులో దాగి ఉన్న మొసలి ఒక్కసారిగా పిల్ల ఏనుగుపై దాడి చేస్తుంది.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
బండిపై వెళ్తున్న అమ్మాయిలు.. లాగిపెట్టి తన్నిన గుర్రం.. వీడియో చూస్తే..

ఇది గమనించిన ఆ తల్లి ఏనుగు తన బిడ్డను రక్షించుకునేందుకు మొసలిపై దాడి చేసింది.ఆ మొసలి కూడా తల్లి ఏనుగు కాలు పట్టుకుని గట్టిగా కరుస్తుంది.అయితే ఏ మాత్రం తగ్గకుండా ఆ తల్లి ఏనుగు పోరాడి తనతో పాటు తన బిడ్డను రక్షించుకుంటుంది.

Advertisement

ఏనుగు దాడిలో గాయపడిన మొసలి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.ఏనుగు ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.

తల్లి ప్రేమకు ఇది నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజా వార్తలు