టెస్ట్ మ్యాచ్ లో ఐదు రోజులు వరుసగా బ్యాటింగ్ చేసిన క్రికెటర్లు వీరే..!

యాషెస్( Ashes Test Series ) తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా( Usman Khawaja ) ఓ సరికొత్త రికార్డు సాధించాడు.

టెస్ట్ మ్యాచ్లో ఐదు రోజులు వరుసగా బ్యాటింగ్ చేసిన రెండవ ఆస్ట్రేలియా క్రికెటర్ గా( Australia Cricketer ) నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్లో ఈ అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్లలో 13వ ఆటగాడిగా నిలిచాడు.యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించడానికి ఉస్మాన్ ఖవాజా కీలక పాత్ర పోషించాడు.

ఉస్మాన్ ఖవాజా ఈ మ్యాచ్లో 518 బంతులను ఎదుర్కొని 206 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటిరోజు 393/8 వద్ద డిక్లేర్ చేసింది.

దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు నాలుగు ఓవర్లు బ్యాటింగ్ చేసింది.రెండవ రోజు ఉస్మాన్ ఖవాజా 126 పరుగులు చేసి అజయంగా నిలిచాడు.

Advertisement

మూడవరోజు 15 పరుగులు జోడించి 141 పరుగుల వద్ద అయ్యాడు.ఇక నాలుగో రోజు రెండు ఇన్నింగ్స్ ప్రారంభించి 273 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయ్యింది.

దీంతో మళ్లీ అదే రోజు ఉస్మాన్ ఖవాజా 34 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.ఇక చివరి రోజు అంటే ఐదవరోజు బ్యాటింగ్ చేసి మరో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

అంటే ఈ మ్యాచ్ లో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్ గా నిలిచాడు.

ఈ ఘనత సాధించి జాబితాలో ముందు నిలిచిన ఆటగాళ్లు వీరే:

మోత్గనల్లి జైసింహ (భారత్‌) వర్సెస్‌ ఆస్ట్రేలియా - 1960జియోఫ్రీ బాయ్‌కాట్ (ఇంగ్లండ్) వర్సెస్‌ ఆస్ట్రేలియా - 1977 కిమ్ హ్యూస్ (ఆస్ట్రేలియా) వర్సెస్‌ ఇంగ్లండ్ - 1980 అలన్ లాంబ్ (ఇంగ్లాండ్) వర్సెస్‌ వెస్టిండీస్ - 1984

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

రవిశాస్త్రి (భారత్‌) వర్సెస్‌ ఇంగ్లాండ్ - 1984 అడ్రియన్ గ్రిఫిత్ (వెస్టిండీస్) వర్సెస్‌ న్యూజిలాండ్ - 1999ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్) వర్సెస్‌ భారతదేశం - 2006 అల్విరో పీటర్సన్ (దక్షిణాఫ్రికా) వర్సెస్‌న్యూజిలాండ్ - 2012

Advertisement

చెతేశ్వర్ పుజారా (భారత్‌) వర్సెస్‌ శ్రీలంక - 2017 రోరీ బర్న్స్ (ఇంగ్లాండ్) వర్సెస్‌ ఆస్ట్రేలియా - 2019 క్రైగ్ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్) వర్సెస్‌ జింబాబ్వే - 2023 టాంగెనరైన్ చందర్‌పాల్ (వెస్టిండీస్) వర్సెస్‌ జింబాబ్వే - 2023ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా) వర్సెస్‌ ఇంగ్లాండ్ - 2023* .

తాజా వార్తలు