ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఒకవైపు గ్రౌండ్ లో తన విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూనే మరోవైపు.
సినిమా డైలాగ్స్ తో.హీరోలు వేసే స్టెప్స్ తో ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంటాడు.తెలుగు, తమిళ సినిమా డైలాగ్స్, సాంగ్స్ తో రీల్స్, టిక్ టాక్ చేస్తూ తన ఫ్యాన్స్ కు వినోదం పంచాడు.‘అల వైకుంఠపురం’ సినిమా లోని బుట్టబొమ్మ సాంగ్ కు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసి తెగ హంగామా చేసిన సంగతి తెలిసిందే.
‘పుష్ప’ సినిమాలో క్రేజీ డైలాగ్ ‘ తగ్గదే లే’ అంటూ తన మార్క్ చూపించారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా కేజీయఫ్: 2 హవా నడుస్తోంది.ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.కాగా.ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన దగ్గర నుండి ట్రైలర్‌లోని ‘వయొలెన్స్.వయొలెన్స్.
వయొలెన్స్’ అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎక్కడ చూసినా ఇదే డైలాగ్ వినిపిస్తుంది.
తాజాగా డేవిడ్ వార్నర్ కూడా కేజీఎఫ్ 2 డైలాగ్ తో రచ్చ చేశాడు.

వయలెన్స్ లైక్స్ మీ అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పాడు.దీనికి తన బ్యాటింగ్ వీడియోలు కూడా మిక్స్ చేసి డైలాగ్ తో.మాషప్ లాగా వీడియో చేసి ఆకట్టుకున్నాడు.ఈ వీడియోపై ఇప్పటికే పలు క్రికెటర్లు కూడా కామెంట్ చేశారు.మరి ఈ వీడియోకి హీరో యష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.కాగా, గతంలో సన్ రైజర్స్ తరుపున ఆడిన డేవిడ్ వార్నర్ ఈ సారి ఢిల్లీ తరుపున ఆడుతున్నాడు.కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన వార్నర్ 65 పరుగులు చేశాడు.







