పెళ్ళికి పిలవలేదా? లేక వీరే వెళ్లలేదా?..ఆర్ఆర్ఆర్ టీమ్ కు అలియాకు మధ్య ఏం జరుగుతుంది?

బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ వార్త ఏదైనా ఉందా అని అంటే అది అలియా భట్, రణబీర్ కపూర్ వెడ్డింగ్ అనే చెప్పాలి.స్టార్ హీరోయిన్ లలో ఒకరైన ఆలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గత కొంత కాలంగా లవ్ ఉన్నారని వార్తలు వస్తున్నా వీరిద్దరూ స్పదించలేదు.

 Aliabhatt Did Not Invite Rrr Stars To Her Wedding, Aliabhatt, Rrr, Aliabhatt,-TeluguStop.com

అయితే వీరు పెళ్లి ఏప్రిల్ 14న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది.

కపూర్ లకు వారసత్వంగా వస్తున్న వాస్తు లో వీరి వివాహం ఘనంగా జరిగింది.

వీరి ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు నిన్నటితో తెరపడింది.బాలీవుడ్ ప్రేమ జంట అలియా, రణబీర్ పెళ్లి తో ఒక్కటి అవ్వడంతో ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.

అయితే తాజాగా ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఎవ్వరు పెళ్ళికి హాజరు కాకపోవడంతో పెళ్ళికి ఈమె వాళ్ళను పిలవలేదా? లేదంటే పిలిచినా వీరే వెళ్ళలేదా అనే విషయం ప్రెసెంట్ బిటౌన్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Telugu Ajay Devgan, Aliabhatt, Deepika, Ntr, Rajamouli, Ram Charan, Ranbir Kapoo

ఈమె ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన పోస్ట్ లు డిలీట్ చెయ్యడంతో ఈ టీమ్ కు ఈమెకు కుదరడం లేదని గొడవల కారణంగానే ఈమె అలా చేసిందని వార్తలు వచ్చాయి.కానీ ఈమె సోషల్ మీడియా ద్వారా అది అబద్ధం అని చెప్పింది.ఇక ఇటీవల ఎన్టీఆర్ 30వ సినిమా నుండి కూడా అలియా తప్పుకుంది.దీంతో ఈమెకు ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు నిజంగానే చెడిందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Telugu Ajay Devgan, Aliabhatt, Deepika, Ntr, Rajamouli, Ram Charan, Ranbir Kapoo

ఇక ఇప్పుడు ఈ టీమ్ లో ఎవ్వరు పెళ్ళికి హాజరు కాకపోవడంతో టీమ్ ని ఈమె పిలవలేదా లేదంటే వీరే హాజరు కాలేదా అనే సందేహాలు మొదలయ్యాయి.అయితే నిజానికి టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ స్టార్ ల సందడి కూడా ఈ పెళ్ళిలో కనిపించలేదు.బాలీవుడ్ ఖాన్ ల సందడి కానీ అలియా స్నేహితురాలు అయినా దీపికా కూడా కనీసం కనిపించలేదు.మరి రెసెప్షన్ లో అయినా స్టార్ ల సందడి ఉంటుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube