ఎన్టీఆర్ 31 పై క్రేజీ అప్డేట్... విలన్ గా కూడా అతనేనా?

టాలీవుడ్ యంగ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ అవుతారని అభిమానులు భావించగా ఇప్పటివరకు ఈయన తన తదుపరి సినిమా షూటింగును మొదలు పెట్టకపోవడంతో అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 Crazy Update On Ntr 31 Is He The Villain Too , Ntr 31 , Directer Koratala Siva ,-TeluguStop.com

ఇక ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి మనకు తెలిసిందే.అయితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా అనంతరం కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31 వ సినిమాని చేస్తున్న విషయం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించారు.ఇక కే జి ఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారు.

Telugu Ntr, Ntrs, Prashantneel-Movie

ఇదిలా ఉండగా తాజాగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎన్టీఆర్ 31 పిరియాడిక్ డ్రామా అని, ఇందులో ఎన్టీఆర్ కి విలన్ గా ఎన్టీఆర్ నటించబోతున్నారని తెలుస్తోంది.అంటే ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నట్లు సమాచారం.ఇలా ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ అద్భుతమైన కథను సిద్ధం చేశారని ఇదివరకే వెల్లడించారు.ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటేనే ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.మరి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుంది ఏంటి అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube