సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ( Sankrantiki vastunnam movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
జనవరి 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాగా ఈ సినిమాకు ఇప్పటికే 165 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రావడం గమనార్హం.ఆరో రోజు ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లు సాధించిన సినిమా రికార్డ్ ఆర్.
ఆర్.ఆర్ మూవీ పేరుపై ఉండేది.సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ రికార్డును కూడా బ్రేక్ చేసేసింది.
వెంకటేశ్( Venkatesh ) సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.నార్త్ అమెరికాలో ఈ సినిమా ఏకంగా 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.యూకేలో సైతం ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్ చేరడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
మరోవైపు డాకు మహారాజ్ మూవీ( Daku Maharaj movie ) 8 రోజుల్లో 156 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పోల్చి చూస్తే ఈ సినిమా కొంతమేర వెనుకబడిందని చెప్పవచ్చు.సంక్రాంతికి వస్తున్నాం మూవీ వెంకటేశ్ ఖాతాలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుందని చెప్పాలి.
వెంకటేశ్ కెరీర్లో 100 కోట్ల రూపాయల ( 100 crore rupees )షేర్ కలెక్షన్లను సాధించిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.వెంకటేశ్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.విక్టరీ వెంకటేశ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
ఈ సినిమాకు సీక్వెల్ రావాలని ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy