మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టినటువంటి నటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
అయితే ఈమె మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తో కలిసి మిస్టర్ ( Mister ) అనే సినిమాలో నటించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది.ఈ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి అంతరిక్షం అనే సినిమాలో కూడా నటించారు.ఇకపోతే ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట తమ ప్రేమ విషయం ఎక్కడ బయటపడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేసి పెద్దల సమక్షంలోనే నవంబర్ ఒకటవ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.పెళ్లి తర్వాత కూడా ఈమె సినిమాలలో నటిస్తారన్న వార్తలు కూడా వినపడుతున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా లావణ్య త్రిపాఠి గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లావణ్య త్రిపాఠి తన సినీ కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించారు.అయితే ఈమె పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) తో కలిసి ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ మిస్ చేసుకున్నారట.ఇలా ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలలో అవకాశం వస్తే ఎవరూ కూడా మిస్ చేసుకోవడానికి ఇష్టపడరు కానీ ప్రభాస్ సినిమాని లావణ్య త్రిపాఠి రిజెక్ట్ చేశారని అలా రిజెక్ట్ చేయడం వల్ల ఈమె మెగా కోడలు అయిందని లేకపోతే మెగా కోడలు అయ్యేది కాదు అంటూ ఒక వార్త సంచలనంగా మారింది.
ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రం రెబల్( Rebel ) .ఈ సినిమాలో తమన్నా దీక్ష సేథ్ ఇద్దరూ కూడా నటించారు.ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినటువంటి ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇక ఈ సినిమాలో నటించే అవకాశం నటి లావణ్య త్రిపాటికి వచ్చిందట అయితే ఈ సినిమాలో దీక్ష సేథ్ పాత్రలో నటించే అవకాశం రాగా ఈ పాత్ర నచ్చక లావణ్య త్రిపాఠి చాలా సున్నితంగా ఈ సినిమాకు నో చెప్పారట.
ఇలా ఈ సినిమా అవకాశాన్ని వదులుకొని లావణ్య త్రిపాఠి మంచి పని చేసిందని చెప్పాలి.ఈ సినిమా ఎంతగా డిజాస్టర్ అయిందో మనకు తెలిసిందే ఇక ఈ సినిమాలో నటించిన దీక్ష సైతం ఇండస్ట్రీకి కనుమరుగయ్యారు.
అప్పటికే లావణ్య త్రిపాటి వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంటూ ఉన్నారు.ఇలాంటి తరుణంలో మరొక ఫ్లాప్ సినిమా కనుక పడి ఉంటే ఈమె కెరియర్ అక్కడితో ముగిసిపోయదని ఇలా కెరియర్ ముగిసి ఇండస్ట్రీకి దూరమై ఉంటే ఈమె మెగా ఇంటికి కోడలు అయ్యే అవకాశం కూడా ఉండేది కాదు అంటూ పలువురు ఈ వార్తలపై కామెంట్స్ చేస్తున్నారు.