సామాన్యులకు ఏమాత్రం ఉపయోగం లేని బడ్జెట్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాయింట్స్

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులను మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది.పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, దానిపై చర్యలు శూన్యం.

 Cpi Leader Ramakrishna Comments On Budget,cpi Leader Ramakrishna,union Budget,ad-TeluguStop.com

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీలను విస్మరించారు.ఎరువులపై సబ్సిడీ ఎత్తివేశారు,గిట్టుబాటు ధరలు లేవు.నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనపై చర్యలు లేవు.కార్పొరేట్ వాళ్ళ ఆస్తులు పెంచేలా ఉంది బడ్జెట్.సామాన్యులకు ఏమాత్రం ఉపయోగం లేని బడ్జెట్ .

ఆంధ్రకు తీరని అన్యాయం చేసారు,ఎన్నికలు వస్తున్నాయని కర్ణాటక అప్పర్ భద్రకు నిధులు కేటాయించారు.

చట్టంలో ఉన్న రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు లేవు,రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసారు.హిండెన్ బర్గ్ నివేదికపై ప్రపంచం అంతా మాట్లాడుతుంటే ఆర్ధిక మంత్రి మాత్రం అంతా బాగానే ఉంది అని చెబుతున్నారు.రాష్ట్రంలో విలువైన భూములు,ప్రాజెక్టులు, అన్ని ఆదానికె దోచిపెట్టారు.8వేల కోట్ల స్కాం కి సత్యం రామలింగరాజు జైలుకి వెళ్లారు.ఆదానిని మాత్రం లక్షల కోట్లు స్కాం బయటపడిన చర్యలు లేవు.స్కాం బయట పెట్టారని అమెరికా సంస్థ అని జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చారు.ఆదాని పై క్రిమినల్ కేస్ పెట్టాలి ,చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్త నిరసనలో భాగంగా రాష్ట్రంలో కేంద్ర కార్యాలయాల వద్ద ఫిబ్రవరి 10 న నిరసనలు చేపడతాం.రాష్ట్రంలో పేదవారికి అన్ని చేస్తున్నాం అని చెప్పిన జగన్ వారికి ఒక గూడు కట్టివ్వలేకపోయారు.1.80 వేల రూపాయలతో ఏ విధంగా ఇల్లు కట్టుకుంటారు.ఇసుక ధరలు పెంచారు,సిమెంట్ ఫ్యాక్టరీలు జగన్ వి ,సిమెంట్ ధరలు పెంచారు.Tidco ఇల్లు పూర్తయి పాడైపోతున్న లబ్ధిదారులకు ఇవ్వకుండా నాశనం చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా కట్టిన వేలాది ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని 6వ తేదీన నిరసనలకు పిలుపునిస్తున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube