ఎక్సపోజింగ్ తో మతి పోగొడుతున్న లావణ్య త్రిపాఠి.. అలా చేస్తుందంటూ ట్రోల్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.అందాల రాక్షసి గా అడుగు పెట్టి తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను తన వైపు లాక్కుంది.

గతంలో లావణ్య మిస్ ఉత్తరఖండ్ గా గుర్తింపు పొంది ఆ గుర్తింపుతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.అలా తొలిసారిగా అందాల రాక్షసి సినిమాతో పరిచయమైంది.

ఈ సినిమాలో తన తొలి నటనతోనే మంచి మార్కులు కూడా సంపాదించుకుంది.ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషలో కూడా నటించింది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అంతగా పేరు తెచ్చుకోలేక పోతుంది.

అవకాశాలు కూడా అంతంతగా మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది.ఇక అవకాశాలు లేకున్నా కూడా.

సోషల్ మీడియాలో మాత్రం బాగా సందడి చేస్తుంది.


ఖాళీగా ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలో తెగ ఫొటోలు షేర్ చేసుకుంటోంది.ఫన్నీ ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.అలా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

  అవకాశాలు లేకపోయేసరికి ఖాళీ సమయం ఎక్కువగా ఉండటంతో  తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా టూర్స్ ప్లాన్స్ చేస్తూ వాటి ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.


గతంలో ఈ బ్యూటీ వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా మారింది.తనతో కలిసి నటించిన మెగా హీరో వరుణ్ తేజ్ తో తను ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.అంతేకాకుండా త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అని ఆ మధ్య టాలీవుడ్ లో బాగా గుసగుసలు వినిపించాయి.

కానీ ఏ రోజు కూడా ఈ వార్తలకు స్పందించలేదు వీరిద్దరూ.దీంతో వీరి మధ్య నిజంగానే లవ్ నడుస్తుంది అని కొందరు అనుమానం పడుతున్నారు.గతంలో వరుణ్ తేజ్ ఫ్యామిలీతో కలిసి లావణ్య దిగిన ఒక ఫోటో కూడా బాగా వైరల్ అయింది.ఇక ఇటీవల వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా కూడా అతని ఫోటో షేర్ చేస్తూ బర్త్డే విషెస్ కూడా చేసింది.

గతంలో వరుణ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈమె బర్త్ డే విష్ చేశాడు.కానీ వీరిద్దరూ మాత్రం తమ మధ్య ఉన్న ప్రేమని రహస్యంగానే ఉంచారు.


అయితే ఇదంతా పక్కన పెడితే ఈమధ్య అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ అందంగా రెడీ అవుతూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ ఉంది.అలా తాజాగా మరికొన్ని ఫోటోలు కూడా షేర్ చేసుకుంది.అందులో మోడ్రన్ డ్రెస్సులో తన చూపులతో మత్తెక్కించింది.అంతే కాకుండా బాగా ఎక్స్పోజింగ్ తో మతి పోగొట్టింది.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్  రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

మేకప్ ఎక్కువయింది.ఓవర్ కూడా ఎక్కువయ్యింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక మరి కొంతమంది వరుణ్ తేజ్ తో పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube