ఏపీలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సీపీఐ

ఏపీలో సీపీఐ పార్టీ బస్సు యాత్ర చేసేందుకు సిద్ధం అయింది.

ఈ మేరకు ఈనెల 17 నుంచి వచ్చే నెల 8 వరకు సీపీఐ బస్సు యాత్రను నిర్వహించనున్నారని తెలుస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని, ప్రత్యేక హోదా వంటి పలు అంశాలపై యాత్రను చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత రామకృష్ణ అన్నారు.సీఎం జగన్ ప్రభుత్వం మూడు నెలల్లో రూ.33 వేల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు.పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేసి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు పెట్టారని మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో పవన్ సత్యం మాట్లాడన్న రామకృష్ణ మభ్యపెట్టే మాటలు మానుకోమని సూచించారు.కేంద్రంతో చెప్పి జగన్ తో ఆడుకుంటానని ఎలా అంటారని ప్రశ్నించారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు