ఇదేందయ్యా ఇది.. చూడడానికి అదో ఆయిల్ టాంకర్.. కానీ లోపల చూస్తే?

ప్రస్తుత రోజులలో రోజురోజుకి అనేక రకాల నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి.

ఈ తరుణంలో నేరస్థులు పోలీసుల నుంచి తప్పించు కోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేయడంతో పాటు అతి తెలివి వ్యవహరించి ఎవరికి అనుమానం రాకుండా అక్రమ రవాణాలను( Illegal Transport ) చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలో పోలీసులు తనిఖీలలో ఇలాంటి ఊహించని సంఘటనలు చాలానే కనిపిస్తుంటాయి.ముఖ్యంగా ఎర్ర చందనం, మందు రవాణా ఇలా అనేక నిషేధ వాటిని ఎక్కువగా అక్రమ మార్గాలలో రవాణా చేస్తుంటారు.తాజాగా, వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా పోలీసులకు ఆయిల్ ట్యాంకర్ పై అనుమానం రావడంతో

ప్రొక్లయినర్‌ తో పగలగొట్టి మరి ఆయిల్ ట్యాంకర్ ను( Oil Tanker ) ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా చివరకు అందులో ఉన్నవి చూసి షాక్ అయ్యారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే.ఒక ఆయిల్ ట్యాంకర్ పై అనుమానం రావడంతో చివరకు ఆ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి ప్రొక్లయినర్‌ రప్పించి ఆయిల్ ట్యాంకను ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు.

ప్రొక్లయినర్‌ సహాయంతో ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయగా.ట్యాంకర్ కు ఒకవైపు ఉన్న భాగాన్ని తొలగించారు.ఇలా తొలగించడంతో ఆయిల్ ట్యాంకర్ లోపల ఒక ఊహించని దృశ్యం కనిపించింది.

Advertisement

ఆయిల్ ట్యాంకర్లు ఆయిల్ ఉండాల్సింది పోయి ఆవులు, గేదెలు కనిపించాయి.చాలా ఆవులను( Cows ) అందులో ఉంచి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఆయిల్ ట్యాంకర్ లో ఇలా చాలా ఆవులను చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.వామ్మో.ఇలాంటి సీన్ మునిపెన్నడూ చూడలేదు అని కామెంట్ చేయగా.

, మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.మరికొంతమంది జంతువులను ఇలా రవాణా చేస్తునందుకు అందుకు కారకులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

సూసేకి పాటకు వధువు క్యూట్ డ్యాన్స్.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు