ఏపీ కేబినెట్ భేటీ :  సోషల్ మీడియా కోసం కొత్త చట్టం ? 

ఏపీలో అనేక సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారుతుంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి నేతలే( YCP Leaders ) టార్గెట్ గా వరుసుగా అరెస్టులు జరుగుతున్నాయి.

 Decision On New Laws For Social Media In Ap Cabinet Meeting Details, Ap Cabinet-TeluguStop.com

దీంతో పాటు అనేక కీలక అంశాల పైన నిర్ణయాలు తీసుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోంది.ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో,  మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు( CM Chandrababu ) తాజాగా నిర్ణయించారు .ఈ సమావేశంలో కీలక అంశాలపై అనేక నిర్ణయాలు తీసుకోనున్నారు.  వాలంటీర్లు,  108 ఉద్యోగుల అంశం ,ప్రభుత్వ పథకాలు అమలుపైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

అలాగే సోషల్ మీడియాలో అసభ్య సందేశాలు నిరోధానికి ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకువచ్చేందుకు క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేనున్నట్లు సమాచారం .మంత్రివర్గ సమావేశం ఈనెల 18న జరగనుంది.అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ప్రత్యేకంగా ఈ భేటీకి చంద్రబాబు నిర్ణయించారు.

Telugu Ap Assembly, Ap, Cm Chandrababu, Janasena, Janasenani, Laws, Telugudesam,

ఈ నెల 22 వరకు అసెంబ్లీ కొనసాగుతుంది.సభలో ఆమోదించాల్సిన బిల్లుల పైన క్యాబినెట్ సమావేశంలో( Cabinet Meeting ) నిర్ణయం తీసుకోనున్నారు.అలాగే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి ప్రత్యేక నిర్ణయాలను తీసుకునే ఆలోచనతో  ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు,  ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.

మహిళలను కించపరిచే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలకు వీలుగా ఈ చట్టాన్ని తీసుకురాభోతున్నట్టు సమాచారం.

Telugu Ap Assembly, Ap, Cm Chandrababu, Janasena, Janasenani, Laws, Telugudesam,

వీటితో పాటు పెండింగ్ లో ఉన్న అనేక అంశాల పైన మంత్రివర్గం సమావేశంలో చర్చించనున్నారు.వాలంటీర్ల కొనసాగింపు అంశం పైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.గత ఐదు నెలలుగా వాలంటీర్ల కు విధులు కేటాయించడం లేదు.

అలాగే వేతనాలు ఇవ్వడం లేదు.బడ్జెట్ లోను ఎటువంటి కేటాయింపులు చేయలేదు.

వీటిపై వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండడంతో , వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి వారి సేవలను గ్రామ,  పట్టణ ప్రాంతాల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఈ మేరకు ఈ క్యాబినెట్ సమావేశంలోనే వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు.

దీంతో పాటు సూపర్ సిక్స్ హామీల అమలు పైన క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube