ప్రజలకు అందుబాటులో ఉన్న వస్తువుల్లో క్వాలీటి మిస్ అవుతుంది గానీ కరోనా వైరస్‌లో మాత్రం క్వాలీటీ అస్సలు తగ్గడం లేదు.మెదటి వేవ్ లో మనదేశం అంతగా ప్రభావితం కాలేదు.
కానీ ఈ వైరస్ రెండో వేవ్ మాత్రం గట్టి గుణపాఠాన్నే నేర్పిందని చెప్పవచ్చూ.ఇకపోతే కరోనా వైరస్ 2019లో బయట పడింది కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్ 19 అని పేరు పెట్టింది.
ఏ మూహర్తాన కోవిడ్ 19 అని నామకరణం చేసారో గానీ అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా రాకెట్‌లా దూసుకు వెల్లుతుంది ఈ కరోనా వైరస్.ఇంత వరకు బాగానే ఉన్న కరోనా వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్న అది ఎక్కడ పుట్టింది.? ఎలా మనిషికి సోకింది.? అనే వివరాలు మాత్రం తేల్చలేక పోయాయి ప్రపంచ దేశాలు.ఇదిలా ఉండగా కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ లోనే తయారైందనడానికి ఎన్నో ఆధారాలున్నాయని, కానీ, అది అబద్ధమని చెప్పే ఆధారాలను మాత్రం చైనా చూపించ లేకపోయిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్ డీఏ) కమిషనర్ గా, ఇప్పుడు ఫైజర్ బోర్డు సభ్యుడిగా ఉన్న స్కాట్ గాట్ లీబ్ కరోనా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
కోవిడ్ గుట్టు రట్టు చేయకపోతే కొవిడ్ 26, కొవిడ్ 32 ముప్పు కూడా ముంచుకొస్తుందని హెచ్చరిస్తున్నారు.ఇక ఈయన మాటలు భవిష్యత్తులో నిజం అయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.
ఇప్పటికైనా కరోనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తేనే ముందు ముందు ముంచుకొచ్చే ముప్పును తప్పించుకోగలం.