భారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రోజుకు 4 లక్షల కేసులు, 4 వేలకు పైగా మరణాలతో ఇండియా వణికిపోతోంది.
అటు వ్యాధి లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.వీరిందరికి వైద్యం అందించలేక ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతోంది.
ఇప్పటికే దేశంలో బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.రానున్న రోజుల్లో కేసులు మరింత పెరిగితే మాత్రం భారత్‌లో పరిస్ధితి మరంత దిగజారే అవకాశాలు వున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే థర్డ్ వేవ్ తప్పదని ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ విజయ రాఘవన్ హెచ్చరించారు.వైరస్ చైన్‌ను బ్రేక్ చేయడానికి ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించగా.మరికొన్ని చోట్ల కర్ఫ్యూ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి.అయినప్పటికీ కేసులు ఏమాత్రం తగ్గకపోగా.మరింత పెరుగుతున్నాయి.తమ వారిని ఆసుపత్రుల్లో చేర్చుకోవాలంటూ రోగుల బంధువుల ఆర్తనాదాలు, కూర్చొన్నవారు కూర్చొన్న చోటే కుప్పకూలిపోతున్న మనుషులు, క్షణం ఖాళీ లేకుండా మండుతున్న స్మశాన వాటికలు.
ఇది భారత్‌లో ప్రస్తుత పరిస్థితి.ఈ పరిస్ధితి చూస్తుంటే కళ్లు చెమర్చక మానవు.
ఇదే సమయంలో ఉద్వేగానికి గురయ్యారు భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.భారత్‌లో పరిస్ధితులు హృదయ విదారకరంగా వున్నాయని.కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇలాంటి విపత్కర పరిస్దితుల్లో అమెరికా అన్ని వేళలా ఇండియాకు బాసటగా నిలుస్తుందని హారీస్ స్పష్టం చేశారు.
అత్యవసర సాయం కింద ఇప్పటికే కాన్సన్ట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సామాగ్రి, పీపీఈ కిట్లు, టీకాల తయారీకి ముడిసరుకులను భారత్‌కు పంపినట్లు ఆమె వెల్లడించారు.అలాగే కోవిడ్‌తో అల్లాడుతున్న అన్ని దేశాలు టీకాను పొందాలన్న ఉద్దేశంతో పేటెంట్ హక్కులను తొలగించేందుకు సాయం చేస్తున్నట్లు కమలా హారిస్ తెలిపారు.

మరోవైపు దారుణ పరిస్ధితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు సాయం పెంచాలని అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమనేత రెస్సీ జాక్సన్.ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరారు.భారతీయులను రక్షించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో గోడౌన్లలో నిరుపయోగంగా పడివున్న 6 కోట్ల ఆస్ట్రాజెనెకా టీకాలను భారత్‌కు అందజేయాలని జాన్సన్ విజ్ఞప్తి చేశారు.ఇదే సమయంలో దేశంలోని ఫార్మా పరిశ్రమలతో మాట్లాడి.
భారత్‌కు మరిన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు, ఔషధాలు పంపేందుకు కృషి చేస్తానని చెప్పారు.