ఎస్మా ప్రయోగంపై అంగన్ వాడీ కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు.ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళనలు చేపడుతున్నారు.
జిల్లా కేంద్రాలతో పాటు పారిశ్రామిక కేంద్రాలు, కార్యాలయాల వద్ద ఎస్మా జీవో ప్రతులను కార్మిక సంఘాల నేతలు దగ్ధం చేస్తున్నారు.అదేవిధంగా ఎల్లుండి జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వం ఇదే తరహాలో మొండి వైఖరిని అవలంభిస్తే బంద్ చేపడతామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.