తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై గెలుపు దిశగా టీమిండియా..!

ప్రస్తుతం కాన్పూర్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.భారత జట్టు తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో చక్కటి స్కోరు సాధించింది.

 Team India On The Verge Of Victory Over New Zealand In The First Test , Team Ind-TeluguStop.com

అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కష్టాల్లో ఉన్న టీమిండియా జట్టును గట్టెక్కించాడు.తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ.

రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులతో శ్రేయస్‌ టీమ్ ఇండియా స్కోరును అమాంతం పెంచేశాడు.వృద్ధిమాన్ సాహా 61 పరుగులతో మంచి సపోర్ట్ ఇచ్చాడు.

దీనితో న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం పెట్టినట్లు అయింది.

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేయగా.

న్యూజిలాండ్ 296 పరుగులు చేసింది.టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 234/7 స్కోర్ కి డిక్లేర్ చేసేసింది.

దాంతో న్యూజిలాండ్ జట్టు విజయం కోసం 284 పరుగులు చేయాల్సి వస్తోంది.అయితే లక్ష్యఛేదనలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 4 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది.

నిజానికి ఇప్పటివరకు ఏ పర్యాటక జట్టు కూడా ఇండియా గడ్డపై 276 లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు.దీన్నిబట్టి ఇప్పుడు న్యూజిలాండ్ తొలి టెస్టులో ఇండియా పై గెలవడం దాదాపు అసాధ్యమే అని చెప్పుకోవచ్చు.

ఇప్పటికే టీమ్ ఇండియా ఫస్ట్ టెస్ట్ పై కన్నేసిందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Telugu Zealand, Ups, India-Latest News - Telugu

న్యూజిలాండ్ నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులకే ఒక వికెట్ కోల్పోయి ఆటను ముగించింది.న్యూజిలాండ్ ఓపెనర్ యంగ్ 2 పరుగులకే అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు.ప్రస్తుతం క్రీజులో లేథమ్ (2), సోమర్ విలే (0) ఉన్నారు.ఇప్పుడు అంటే ఐదో రోజు గెలుపు కోసం న్యూజిలాండ్ ఇంకా 280 పరుగులు చేయాల్సి ఉంది.

లేథమ్ తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు (95; 282 బంతుల్లో 10×4) సాధించాడు.ఇప్పుడు అతడి పైనే న్యూజిలాండ్ జట్టు ఆశలన్నీ పెట్టుకున్నాయి.అలాగే కేన్ విలియమ్సన్, రాస్‌టేలర్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube