టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు నటి పవిత్ర లోకేష్(Pavitra Lokesh) .ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించిన పవిత్ర లోకేష్ గత కొంతకాలంగా నరేష్ (Naresh) వ్యవహారం వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.
నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా వ్యక్తిగతంగా రిలేషన్ లో ఉంటున్నారు.ఈ విషయం తెలియడంతో పవిత్ర లోకేష్ ఒక్కసారిగా ఎంతో పాపులర్ అయ్యారు.
ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉండటమే కాకుండా ఇద్దరు కలిసి మళ్ళీపెళ్లి (Malli pelli) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో వీరిద్దరూ కాస్త రొమాంటిక్ గానే నటించారని తెలుస్తుంది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఈ జంట ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరు అవుతూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.ఇలా మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్న పవిత్ర లోకేష్ కు ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.
ఇలా ఈమెకు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడంతో ఈమె తన రెమ్యూనరేషన్(Remuneration) కూడా భారీగా పెంచారని తెలుస్తుంది.పవిత్ర లోకేష్ ఒక్కరోజు కాల్ షీట్ కోసం భారీగా చార్జ్ చేయడంతో నిర్మాతలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఇదివరకు ఈమె ఒక కాల్ షీట్ కోసం కేవలం 50వేల రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకునేవారు.ఎప్పుడైతే నరేష్ వ్యవహారం కారణంగా ఫేమస్ అయ్యారు.అలాగే మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ఈమెకు మరింత పాపులారిటి రావడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచారని తెలుస్తుంది.ప్రస్తుతం పవిత్ర లోకేష్ ఒక్క కాల్ షీట్ కోసం దాదాపు లక్ష రూపాయల(One Lakh) వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇలా ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ పెంచడంతో నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు.అయితే ఈమెకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈమె అడిగినది మొత్తం ఇవ్వడం నిర్మాతల వంతు అయింది.
