అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 షూటింగ్ లో రష్మిక మందన జాయిన్ అయింది.మొదటి షెడ్యూల్ విశాఖపట్నం లో జరిగింది.
ఆ షెడ్యూల్లో రష్మిక మందన పాల్గొనలేదు.ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న తాజా షెడ్యూల్ చిత్రీకరణ లో భాగంగా రష్మిక మందన అల్లు అర్జున్ తో కలిసి కొన్ని కీలక సన్నివేశాలు నటిస్తుందట ఈ షెడ్యూల్లో రష్మిక మందన దాదాపుగా 10 నుండి 15 రోజుల పాటు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత ఒక పాట చిత్రీకరణ ఉంటుందట.మొత్తానికి ఈ సినిమా కోసం రష్మిక మందన దాదాపుగా 40 రోజుల పాటు డేట్ లను కేటాయించినట్లు తెలుస్తోంది.
దర్శకుడు సుకుమార్ 40 నుండి 50 రోజుల డేట్లు ఈమె నుండి కోరాడని, ఆ డేట్స్ లోనే సినిమా ను పూర్తి చేయాలని భావిస్తున్నాడట.

అల్లు అర్జున్ యొక్క డేట్స్ ఈ సంవత్సరం చివరి వరకు తీసుకున్న సుకుమార్ రష్మిక మందన డేట్స్ కేవలం 40 నుండి 50 రోజులు మాత్రమే తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది.దీన్ని బట్టి సినిమాలో ఆమె పాత్ర ఎంత తక్కువగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.పుష్ప 2 లోనే రష్మిక మందన యొక్క పాత్ర చాలా తక్కువగా ఉంది.
ఇప్పుడు ఆమె పాత్ర మరింతగా కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే అవకాశాలు లేక ఢీలా పడి పోయి ఉన్న రష్మిక మందన కెరియర్ లో పుష్ప 2 అత్యంత కీలకంగా మారింది.
అలాంటిది ఈ సినిమా లో తక్కువ నిడివి పాత్రలో కనిపిస్తే ఆమె కెరియర్ కి ఎంత వరకు ఉపయోగపడుతుందనేది చూడాలి.పుష్ప సినిమా తో పాటు తమిళంలో ఒక సినిమా ను చేస్తున్న రష్మిక బాలీవుడ్ నుండి ఆఫర్లు లేకపోవడంతో చాలా స్లోగా కెరీర్ లో ముందుకు సాగుతోంది.
హిందీ లో చేసిన సినిమాలు నిరాశ పర్చడంతో కెరీర్ విషయంలో గందరగోళంగా ఉంది.