శ్మశానం క్వారంటైన్‌.. వణికిపోతున్న కరోనా బాధితులు!

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది.తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

అంచనాలను మించి కేసులు నమోదవుతూ ఉండటంతో కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న బాధితులు హోం క్వారంటైన్ లోనే ఉండి చికిత్స చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.అయితే పలు ప్రాంతాల్లో అధికారులు కరోనా రోగుల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు.

శ్మశానంలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు.పూర్తి వివరాలలోకి వెళితే నారాయణఖేడ్ జిల్లాలోని ఖానాపూర్ లో అధికారులు కరోనా రోగులకు శ్మశానంలోని గదులను క్వారంటైన్ కేంద్రాలుగా కేటాయించారు.

సాధారణంగా కరోనా సోకిన వాళ్లకు ఆస్పతుల్లో లేదా హోం క్వారంటైన్ లో చికిత్స జరగాలి.కరోనా రోగి ఇంట్లో అన్ని వసతులు ఉంటే మాత్రమే హోం క్వారంటైన్ కు అనుమతి ఇస్తారు.

Advertisement

కానీ కరోనా సోకిన వాళ్లకు శ్మశానంలోని గదులను కేటాయించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మనుషుల్లో మానవత్వాన్ని, బంధాలను చెరిపేస్తున్న కరోనా వైరస్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

అధికారుల బాధ్యతారాహిత్యానికి ఈ ఘటన నిదర్శనమని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బాధితులు త్వరగా కోలుకునేలా సహాయసహకారాలు అందజేయాల్సిన అధికారులు శ్మశానంలో గదులను కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం ఈ ఘటన విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

అట్లీ ని ట్రోల్ చేస్తున్న అల్లు అర్జున్ అభిమానులు...
Advertisement

తాజా వార్తలు