వైరల్‌ : చైనాలో ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది, భార్య భర్తలది మరీ వింత పరిస్థితి

ప్రస్తుతం చైనాలో ఉన్న పరిస్థితికి ప్రపంచ దేశాలన్నీ కూడా అయ్యో అంటున్నాయి.

ఇదే సమయంలో వారి తిండి అలవాట్లు మరియు వారి జీవన విధానం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

వీరి వల్ల ప్రస్తుతం ప్రపంచ దేశాలు కూడా ఇబ్బందుల పాలవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం చైనాలో ఉన్న పరిస్థితుల గురించి సోషల్‌ మీడియాలో ఫన్నీ వీడియోలు తెగ ప్రసారం అవుతున్నాయి.

ముఖ్యంగా ఈమద్య ఒక వీడియో వైరల్‌ అవుతుంది.ఆ వీడియోలో ఒక భర్త బయట నుండి ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకు వచ్చాడు.

ఇంట్లోకి రాగానే భర్త తుమ్ముతాడు.దాంతో కాలితో భర్తను బయటకు తన్ని భార్య డోర్‌ వేసుకుంటుంది.

Advertisement

ఆ తర్వాత ఇల్లును శుభ్రం చేసుకుంటుంది.అంతగా ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఉందంటూ ఆ వీడియోలో చెప్పకనే చెప్పారు.

ఇక చైనాలో భార్య భర్తలు కలిసేందుకు కూడా భయపడుతున్నారట.దేశంలోని ప్రతి చోట కూడా ఈ భయం కనిపిస్తుంది.

ఒక సర్వే ప్రకారం గత రెండు వారాలుగా చైనాలో భార్య భర్తలు కనీసం పడకగదిలో కలిసి పడుకునేందుకు కూడా భయపడుతున్నారట.ముఖ్యంగా భర్తలు లేదా భార్యలు బయటకు వెళ్లి వస్తే వారిని తాకేందుకు కూడా భయపడుతున్నట్లుగా చెబుతున్నారు.చైనాలోని ప్రతి ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)

ప్రపంచ దేశాలతో చైనాకు ఇప్పటికే సంబంధాలు తెగిపోయాయి.ఆ దేశం నుండి రాకపోకలు పూర్తిగా నిషేదించారు.

Advertisement

ఇది ఇంకా ఎంత కాలం సాగుతుంది అనేది ఎవరికి తెలియడం లేదు.

తాజా వార్తలు