అమ్మాయికి పీరియడ్స్ ప్రారంభమైతే ఆ దేశాల్లో పండగే..

ఏ అమ్మాయి జీవితంలోనైనా ఆమెకు పీరియడ్స్‌ వచ్చే దశకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.ఒక అమ్మాయి స్త్రీగా తన భవిష్యత్తుకు పునాది వేసుకునే దశ ఇది.

 Countries In World Where Girls First Periods Is Celebrated Details, Woman, Perio-TeluguStop.com

పీరియడ్స్ అనేది ఒక అమ్మాయి శరీరంలో చోటుచేసుకునే ఒక ముఖ్యమైన దశ.దీనిపై ఆమె జీవితంలో చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి.భారతదేశంలో చాలా మంది అమ్మాయిలు పీరియడ్స్‌ను దాచిపెడతారు.మెడికల్‌ స్టోర్‌లో ప్యాడ్‌ తీసుకోవడానికి వెళ్తే దుకాణదారుడు దానిని పేపర్‌లో బాగా చుట్టి నల్లటి ప్లాస్టిక్‌లో కట్టి ఇస్తాడు.

వాటిని కొనుగోలు చేసేవారు దాచుకుంటూ తీసుకువెళతారు.దీనితోపాటు, ఈ సమయంలో పీరియడ్స్ వచ్చిన అమ్మాయి అనేక రకాలుగాగా అంటరానితనానికి గురవుతుంది.

భారతదేశంలోని చాలా ఇళ్లలో పీరియడ్స్ సమయంలో అమ్మాయిలను పూజగదిలోకి, వంటగదిలోకి రానివ్వరు.అదే సమయంలో వారిపై అనేక రకాల వివక్షలు కొనసాగుతాయి.అయితే ప్రపంచంలో కొన్ని ప్రదేశాలలో పీరియడ్స్‌ను పండుగలా జరుపుకుంటారు.అక్కడ ఇంటిలోని అమ్మాయిలకు పీరియడ్స్ వస్తే ఆ సమయంలో పార్టీ చేసుకుంటారు.ఈ కోవలోని కొన్ని దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెజిల్:

Telugu Brazil, Iceland, India, Japan, Periods, Strange Ritual-General-Telugu

ఈ దేశంలో ఇంటిలోని అమ్మాయికి పీరియడ్స్ ప్రారంభమైనప్పుడు, ఆమె తల్లిదండ్రులు దాని గురించి బంధువులకు తెలియజేస్తారు.ఇది బ్రేకింగ్ న్యూస్ లాగా వ్యాపిస్తుంది.ఆ తర్వాత అందరూ ఒకచోట గుమిగూడి పార్టీ చేసుకుంటారు.

జపాన్:

Telugu Brazil, Iceland, India, Japan, Periods, Strange Ritual-General-Telugu

ఇక్కడ ఒక అమ్మాయికి ఋతుస్రావం ప్రారంభమైనప్పుడు, ఆమె తల్లి జపనీస్ సాంప్రదాయ వంటకం సెకిహాన్‌ను సిద్ధం చేస్తుంది.ఇది బియ్యం, ఎరుపు బీన్స్‌తో తయారు చేస్తారు.పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ వంటకం చేస్తారు.అటువంటి పరిస్థితిలో అమ్మాయికి పీరియడ్ ప్రారంభమైందని అందరికీ తెలుస్తుంది.

ఐస్‌లాండ్:

కూతురికి పీరియడ్స్ రాగానే ఇక్కడ అమ్మ రెడ్ అండ్ వైట్ కేక్ చేస్తుంది.ఆ తర్వాత కేక్‌ను ముందుగా కూతురికి తినిపించి, ఆ తర్వాత కేక్‌ను అందరికీ పంచిపెడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube