ఏపీ తెలంగాణ లకు ' లాక్ ' తప్పదా ?

ఏపీ తెలంగాణలో కరుణ భావిస్తూ డేంజర్ బెల్ మోగిస్తోంది.లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది.

ప్రస్తుతం ఆందోళనకర రీతిలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.కరోనా కట్టడికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా, కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా జనాల్లో కరోనా వైరస్ పై సరైన అవగాహన లేక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తూ ఉండడం, భౌతిక దూరం పాటించకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో కేసుల సంఖ్య అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూ వస్తున్నాయి.మిగతా రాష్ట్రాల్లోనూ ఇంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నా, మొదట్లో ఇక్కడ కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవ్వడం, ఇప్పుడు అక్కడ తీవ్ర స్థాయిలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కు కారణం అవుతోంది.

ఇక తెలంగాణ, ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నాయి.ఇక తెలంగాణలోనూ ఇప్పుడిప్పుడే టెస్ట్ ల సంఖ్య బాగా పెంచుతున్నారు.

Advertisement

మొదట్లో పదుల సంఖ్యలో ఉన్న కేసులు ఇప్పుడు వందల సంఖ్యలో చేరుతుడటం, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడ లాక్ డౌన్ విధించాలనే డిమాండ్ పెరిగింది.

అంతేకాకుండా ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి.దీంతో తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ విధించాలనే డిమాండ్ ఇప్పుడు ఎక్కువ అయ్యింది.అదీ కాకుండా, తెలంగాణ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడంతో ప్రభుత్వం కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఇక ఏపీలోనూ ఈ కరోనా విజృంభణ తీవ్రంగానే ఉంది.ఇప్పటికే ఏపీలో ఎనిమిది వేల కేసులు పైగా దాటిపోయాయి.రోజుకు 400 పైగా కేసులు కొత్తగా నమోదవుతున్నాయి.

వీటి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికి కొన్ని పట్టణాలలో లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు.ముందు ముందు ఇదే విధంగా ఉంటే పరిస్థితి చేయి దాటి పోతుందని ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

ఇప్పటికే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 100కు పైగా దాటింది.ముఖ్యంగా కర్నూలు , కృష్ణ ,గుంటూరు , చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలో ఏపీలోనూ మరోసారి లాక్ డౌన్ విధించాలనే సూచనలు ఎక్కువగా వస్తుండడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తుండడంతో, లాక్ డౌన్ విధించే విషయంపై జగన్, కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంట ప్రజలందరిలో నెలకొంది.

తాజా వార్తలు