కరోనాకి విరుగుడు కనిపెట్టిన అమెరికా డాక్టర్...!!!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ధాటికి ప్రజలు పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు.ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ఏమి చేయాలని పరిస్థితులో దేశాధినేతలు చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

కరోనాకి విరుగుడు కనుగొంటామని ఆ ప్రయత్నాలలో ఉన్నామన్నా అమెరికా అందుకు తగ్గట్లుగా పరిసోధనల్లో స్పీడు పెంచింది.ఒక్క అమెరికాలోనే మరణాల సంఖ్య 4 వేలు దాటడంతో అధ్యక్షుడు ట్రంప్ పరిశోధకులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కరోనా వైరస్ కి విరుగుడు కనిపెట్టాను అంటూ అమెరికా వైద్యుడు ఒకరు ప్రకటించారు.అమెరికాలోని కాలిఫోర్నియా కి చెందిన జాకబ్ గ్లాన్ విల్లె అనే డాక్టర్ కరోనాకి మందు కనుగొన్నానని ప్రకటించారు.

అందకు ఆయాన ఎలాంటి పద్దతులని ఉపయోగిచాడు అనేది కూడా తెలిపాడు.సార్స్ వైరస్ నిర్వీర్యం చేసిన యాంటీ బాడీస్ నే కరోనా విరుగుడికి కూడా వాదినట్టుగా ఆయన తెలిపారు.

Advertisement

సార్స్ ని నిర్వీర్యం చేసే యాంటీబాడీస్ పై విస్తృతంగా పరీక్షలు చేసినట్టుగా ఆయన తెలిపారు.మనిషి శరీరంలోకి కరోనా వైరస్ ఎస్ ప్రోటీన్ కణాల ద్వారా ప్రవేసిస్తోందని ఈ ఎస్ ప్రోటీన్ ని తాము ప్రయోగించిన యాంటీ బాడీస్ విచ్చిన్నం చేసిందని ప్రకటించారు.త్వరలోనే దీనిని మనుషులపై క్లినికల్ ట్రైల్స్ పూర్తి చేస్తామని తెలిపారు.

అయితే ఈ ప్రయోగం ఆమోదం పొందిన అమలు లోకి రావాలంటే సెప్టెంబర్ లో అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు