కరోనా దెబ్బ – భారత్ లో వీసా కార్యకలాపాలకి బ్రేక్...!!!

కరోనా దెబ్బ కి బెంబేలెత్తి పోతోంది అమెరికా.

తొడగొట్టి మరీ ట్రంప్ కరోనాతో తేల్చుకుంటామని ప్రకటించిన వారం రోజుల్లోనే కరోనా దెబ్బకి టొరంటోల దాడి ఎంతో బెస్ట్ అనిపిచ్చేసింది.

ఎంతో సమర్ధవంతగా కరోనాని ఎదుర్కుంటామని ప్రకటించిన ట్రంప్ కనీసం శానిటరీ మాస్క్ లు సైతం ప్రజలకి అందివ్వలేని పరిస్థితిలో ఉన్నారు.ఇప్పటికే 50 మంది అమెరికన్స్ ని పొట్టన బెట్టుకున్న కరోనా 2 వేల మందికి పైగా బాధితులని మంచాలపై పడేసింది.

దాంతో అమెరికా తక్షణ చర్యలు చేపట్టే పనిలో పడింది.అమెరికాలో రద్దీగా ఉండే హోటల్స్మ్ మాల్స్, స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్ , యూనివర్సిటీ ఇలా ప్రతీ ఒక్కరికి సెలవలు ప్రకటించి ఎవరూ బయట తిరగవద్దని ఆదేశించింది.

ఇదిలాఉంటే ఈ ప్రభావం భారత్ నుంచీ అమెరికా రావాలనుకునే నిపుణులు, విద్యార్ధులపై కూడా పడింది.భారత్ లో ఉన్న అమెరికన్ కాన్సులేట్లు , ఎంబసీ, అన్నిటి సేవలు ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

ఈ పరిణామాలతో భారత్ లో వీసా కార్యకలాపాలు ఆపేస్తున్నట్లుగా భారత్ లో ఉంటున్న అమెరికా అధికారులు ప్రకటించారు.అయితే ఈ ప్రక్రియ తాత్కాలికమేనని తెలిపారు.

ఇండియాలో ఉన్న అన్ని కాన్సులేట్లు, ఇమ్మిగ్రెంట్ , నాన్ ఇమ్మిగ్రెంట్ వేసాలని రద్దు చేస్తున్నట్లుగా USCIS వెబ్ సైట్ లో పేర్కొంది.అయితే ఈ నిలిపివేతని సోమవారం నుంచీ అమలు అవుతుందని, ఎప్పుడు ముగింపు తేదీ ఉంటుందని తెలిపలేమని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు