ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్క రోజులోనే !

దేశంలో కరోనా శరవేగం వ్యాప్తి చెందుతోంది.దేశవ్యాప్తంగా రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదువుతున్నాయి.

రాష్ట్రాల్లో వేలల్లో కేసులు నిర్ధారణ కావడంతో వైద్యులు కరోనా బాధితులను హోం క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.అత్యవసరమైన పేషంట్లను ఆస్పత్రిలో జాయిన్ చేయించుకుంటున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనాను కట్టడి చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించడానికి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించింది.

కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటిన్ ను గురువారం విడుదల చేసింది.24 గంటల్లో 66,999 కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం కేసులు 23 లక్షల 96 వేలకు చేరుకుంది.దేశవ్యాప్తంగా మొత్తం 56,383 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Advertisement

దీంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 16,95,982 కు చేరింది.కాగా, నిన్న ఒక్క రోజే 942 మంది మరణించడంతో ఆ సంఖ్య 47,033కి చేరింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 6,53,622 ఉన్నాయి.శాతాల ప్రకారం యాక్టివ్ కేసులు 27.64, మరణాల రేటు 1.98, రికవరీ రేటు 70.38 శాతంగా నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు