దేశంలో కరోనా టీకా పంపిణీ జరుగుతున్నా.. అక్కడ మరో లాక్‌డౌన్ తప్పదా.. ?

గత సంవత్సరం ప్రజలందరికి నరకం చూపించిన కరోనా మళ్లీ తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్దం అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకుంటున్న విషయం తెలిసిందే.

ఒకవైపు దేశ వ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతున్నా, దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, మహారాష్ట్రలో మాత్రం మళ్లీ కరోనా పడగ విప్పుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇకపోతే మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం చూస్తుంటే ఇక్కడ మరోమారు లాక్‌డౌన్ విధించడం తప్పని సరిగ్గా కనిపిస్తుందట.ఇక మహారాష్ట్రలో నవంబర్ తర్వాత ఈస్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి ఇప్పటికే ముంబయితో పాటు టైర్-2, టైర్-3 సిటీలలో లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా అమరావతి, ఔరంగాబాద్, జల్నా, యావత్మల్, పూణె, అకోలా వంటి జిల్లాలలో విధించిన పాక్షిక లాక్‌డౌన్‌ కూడా పొడిగించారు.మరి ఈ కరోనా కొత్త స్ట్రైయిన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

కరోనా టెస్టుల సంఖ్యను కూడా పెంచుతున్నారు.ఇక మురికివాడ ధారావిలో కూడా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందట.

Advertisement

ఈ వ్యాప్తి మళ్లీ మన నగరాన్ని తాకితే మాత్రం పరిస్దితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.జాగ్రత్తపడండి.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు