వేసవికాలం( Summer ) వచ్చిందంటే కాలు బయట పెట్టాలంటే కూడా భయమే.వేసవి తాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది.
అధిక ఉష్ణోగ్రత వల్ల ఇంట్లో ఫ్యాన్ గాలి కూడా వేడి గానే ఉంటుంది.ఏసీ లేకపోతే క్షణం కూడా ఉండలేని పరిస్థితి.
ఏసీ ఆన్ చేస్తే కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి.దీంతో ప్రజలు వేసవికాలం అంటేనే భయపడిపోతున్నారు.
ఇలాంటి వేసవికాలంలో చల్లదనం ఇచ్చే వస్తువులు అంటే ఇష్టపడని వారు ఉండరు.ఈ క్రమంలో తాజాగా ఏసీ లాంటి కూలింగ్ బెడ్ షీట్స్( Cooling Bed Sheet ) మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.
ఎంత అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కూలింగ్ బెడ్ షీట్ తో వేసవి తాపానికి ఎంచక్కా చెక్ పెట్టొచ్చు.ఈ బెడ్ షీట్ పై పడుకుంటే చల్లదనం ఆస్వాదిస్తూ సుఖంగా నిద్రపోవచ్చు.ఇది చూడడానికి సాధారణ బెడ్ షీట్ మాదిరే కనిపిస్తుంది.
దీని ప్రత్యేకతలు మాత్రం అద్భుతమనే చెప్పాలి.

ఈ బెడ్ షీట్ లో కూలింగ్ జెల్ మ్యాట్రెస్( Cooling Gel Mattress ) ఉంటుంది.అంటే చల్లదనం కోసం జల్ సాంకేతికతను ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేశారు.ఈ బెడ్ షీట్ లో గాలి నింపబడి ఉంటుంది.ఏర్పాటుచేసిన ఫ్యాన్ 4.5 వాట్ల శక్తిని ఉపయోగిస్తుంది.అంటే ఒక యూనిట్ విద్యుత్ తో ఒక వారం పాటు ఈ బెడ్ షీట్ రన్నింగ్ లో ఉంటుంది.

ఈ బెడ్ షీట్ బరువు కేవలం రెండు కేజీలు మాత్రమే ఉంటుంది.దీన్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సులువుగా తీసుకు వెళ్ళవచ్చు.ఈ బెడ్ షీట్ కూలింగ్ టైమర్ తో లభిస్తుంది.
వేసవిలో వేడి తాపం నుంచి తమను తాము కాపాడుకొని సుఖంగా నిద్ర పోవాలంటే ఈ కూలింగ్ బెడ్ షీట్ ఇంట్లో ఉండాల్సిందే.అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో బడ్జెట్ ధరలోనే ఈ బెడ్ షీట్లు లభించనున్నాయి.







