ఈరోజుల్లో ఒక సినిమా తీయడం ఎంత కష్టమో దానికి తగ్గ టైటిల్ పెట్టడం కూడా అంత కంటే ఎక్కువ కష్టం అవుతుంది… ఇక మహేష్ బాబు( Mahesh Babu ) సినిమా విషయానికి వస్తే మొదటి నుంచి ఈ సినిమాకి చాలా అడ్డంకులు వచ్చాయి.సినిమా ముహూర్తం జరుపుకోవడానికి చాలా రోజులు పట్టింది.
ఆ తర్వాత సినిమా మొదలైంది.కానీ రెగ్యులర్ షూటింగ్ కోసం చాలా రోజులు ఆగాల్సి వచ్చింది.
మొదలైంది అనుకునేసరికి తొలి షెడ్యూల్ అయ్యాక రెండో షెడ్యూల్ కోసం చాలా రోజులు ఆగాల్సి వచ్చింది.ఆ కారణాల సంగతి తర్వాత చూస్తే.
ఇప్పుడు సినిమా పేరు గురించి చర్చ నడుస్తోంది…
సినిమాకు పేరు పెట్టడానికి చాలా చర్చలు జరుగుతాయి.అయితే ఈ సినిమా గురించి చాలా చాలా చర్చలు జరుగుతున్నాయి అని చెప్పాలి.
రకరకాల పేర్లు బయటకు వినిపిస్తున్నా.ఇంకా ఏ పేరు కూడా ఫిక్స్ కాలేదు.
దీంతో సినిమా పేరు కోసం ఇంతగా చర్చలు జరగాలా అనే విమర్శలు వస్తున్నాయి.అయితే ఇప్పుడు వినిపిస్తున్న పేరు మహేష్‌బాబు ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చేది అని చెప్పొచ్చు.అదే మన ఊరి వీరుడు అనే టైటిల్ ను ఫైనల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఈ మేరకు టైటిల్ మీద త్రివిక్రమ్ ( Trivikram ) టీమ్ చర్చలు జరుపుతోందట.ఈ నెల 31న అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు అని అంటున్నారు.కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌తో చిన్న టీజర్ కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట.ఈ పేరుకు ముందు ‘అమరావతికి అటు ఇటు’, ‘గుంటూరు మిర్చి’ లాంటి పేరు్లు కూడా వినిపించాయి…

కానీ వాటి కంటే మన ఊరి వీరుడు( Mana Oori Veerudu ) అనే పేరు బాగుంటుంది అని అనుకుంటున్నారట.మహేష్ అందుబాటులోకి వచ్చాక టైటిల్ విషయంలో క్లారిటీ వస్తుందని, అప్పుడు వీడియో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తారట.ఈ వీడియోలో ప్రత్యేకంగా కొత్తగా ఏం చెప్పరని, పోస్టర్‌లో ఉన్న మిర్చి మార్కెట్ నేపథ్యంలోనే ఉంటుందని చెబుతున్నారు…
ఇక ఈ సినిమా మీద మహేష్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఎందుకంటే మహేష్ ఇంతకు ముందు చేసిన సర్కారు వారి పాట సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఇక దాంతో త్రివిక్రమ్ సినిమాతో సక్సెస్ కొట్టి రాజమౌళి కాంపౌండ్ లోకి ఎంటర్ అవ్వాలని మహేష్ బాబు చూస్తున్నట్టు గా తెలుస్తుంది…
.







