ధోని నియామకంపై వివాదం.టీ20 ప్రపంచకప్ లో టీమిండియాకు మెంటర్ గా ఎంఎస్ ధోని నియమించడంపై అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదు అందింది.లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం ధోని నియామకం పరస్పర విరుద్ధ ప్రయోజనాల క్లాజ్ ఉల్లంఘన 38(4) కిందికి వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు.ఈ విషయమై ఆయన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి షా సహా అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు లేఖ రాశాడు.
లోధా కమిటీ సిఫార్సుల మేరకు ఓ వ్యక్తి రెండు పదవులు ఎలా నిర్వహిస్తారని విషయంపై సంజీవ్ గుప్తా స్పష్టత కోరారు.అయితే దీనిపై అపెక్స్ కౌన్సిల్ తన లీగల్ టీమ్ ను సంప్రదించాల్సో ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే ధోని ఇప్పటికే బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.తాజాగా అతను టీమిండియాకు మెంటర్ గా కూడా ఎంపిక కావడంతో ఈ వివాదం మొదలైంది.
కాగా సంజీవ్ గుప్తా గతంలో కూడా ఆటగాళ్లపై ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఫిర్యాదులు చాలా చేశాడు.ఈ వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.