రఫేల్‌ వివాదం కారణంగా ఒక చిన్న గ్రామంకు పెద్ద తలనొప్పి... అదేంటో తెలుసా?  

Controversy On Rafel Made Head Ach To A Village-

బీజేపీ అయిదు సంవత్సరాల పాలనలో ఎన్నో లోపాలు ఉన్నాయి.అయితే వారి ఆధ్వర్యంలో జరిగిన రఫేల్‌ యుద్ద విమానాల ఒప్పందం మాత్రం మాయని మచ్చగా మిగిలి పోనుంది.దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేక ప్రచారంకు కాంగ్రెస్‌ రఫేల్‌ను ప్రముఖంగా వాడుకుంటుంది.మోడీ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేందుకు రఫేల్‌ కుంభకోణంను కాంగ్రెస్‌ అధినేత ప్రముఖంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

Controversy On Rafel Made Head Ach To A Village--Controversy On Rafel Made Head Ach To A Village-

ఈ వివాదం ఇంత రచ్చ జరుగుతుంటే ఈ వివాదం కారణంగా ఒక గ్రామ ప్రజలు మాత్రం మానసిక ఆవేదన పడుతున్నారు.

Controversy On Rafel Made Head Ach To A Village--Controversy On Rafel Made Head Ach To A Village-

పూర్తి వివరాల్లోకి వెళ్తే…ఛతీస్‌గఢ్‌ రాష్రంలో మహా సముంద్‌ అనే నియోజక వర్గంలో ఒక చిన్న గ్రామం ఉంది.ఆ గ్రామం పేరు రఫేల్‌.ఆ గ్రామంలో జనాభా రెండు వేల లోపే.గత కొన్ని నెలలుగా తమ గ్రామం పేరు పదే పదే మీడియాలో వస్తున్న నేపథ్యంలో ఆ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేశంను కుదిపేస్తున్న కుంభకోణం తమ గ్రామం పేరు ఒక్కటే అవ్వడం వల్ల మొత్తం గ్రామస్తులు అంతా కూడా కలిసి గ్రామ సభ ఏర్పాటు చేసుకుని మరీ ఒక నిర్ణయానికి వచ్చారు.తమ గ్రామం పేరును మార్చుకోవాలని భావించారు.

గ్రామ సర్పంచ్‌ మరియు పది మంది బృందం కలిసి ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.కాని కలెక్టర్‌ పట్టించుకోలేదు.దాంతో సీఎంను కలిసేందుకు ప్రయత్నించారు.అయితే ఎన్నికల కారణంగా సీఎం అపాయింట్‌మెంట్‌ లభించలేదు.దాంతో వారు ఎన్నికల తర్వాత అయినా తమ గ్రామం పేరును మార్చుకుంటామని అంటున్నారు.

రఫేల్‌ పేరు ఉన్నంత మాత్రన ఏమవుతుందని కొందరు ప్రశ్నిస్తుంటే వారు మాత్రం బాబోయ్‌ మాకు ఈ పేరు వద్దంటే వద్దు అంటూ భీష్మించుకు కూర్చున్నారు.