దువ్వాడ శ్రీనివాస్‌ఇటీవల వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్న వైసీపీ నాయకుడు.శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ నాయకుడు ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిపై ఘోరంగా ఓడిపోయారు.
అయితే కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నారు.అయితే అనూహ్యంగా ఆయన పంచాయతీ ఎన్నికల్లో రెచ్చిపోయారు.
ముఖ్యంగా నిమ్మాడ పంచాయతీని వైసీపీకి కట్టబెట్టే క్రమంలో అచ్చెన్నపై సై అంటే సై అంటూ రెచ్చిపోయారు.ఇంత వరకు బాగానేఉన్నా తర్వాత కూడా దూకుడు తగ్గించలేదు.
ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు పార్టీకి లాభం కంటే నష్టం చేకూర్చేవిధంగా ఉందని దర్మాన సోదరులు భావిస్తున్నారు.ఇక, దువ్వాడ మిత్రుడు మంత్రి సీదిరి అప్పలరాజుకు మధ్య కూడా ఈ పరిణామం గ్యాప్ పెంచిందని అంటున్నారు.
వాస్తవానికి ఆది నుంచి ఇద్దరూ కూడా మిత్రులుగా తిరిగారు.ఒకరి భుజాలపై చేతులు వేసుకుని ఒకరు పాదయాత్రలు, ప్రచారాలు సైతం నిర్వహించారు.
దీంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందనే ప్రచారం కూడా జరిగింది.అయితే అ నూహ్యంగా దువ్వాడ దూకుడు పెంచడం తనకు జగన్ నుంచే మద్దతు ఉందని ప్రచారం చేసుకోవడంతో మంత్రి కినుక వహిస్తున్నారు.

జిల్లా రాజకీయాల్లో ఇప్పటి వరకు కత్తులు, బ్యాట్ల సంస్కృతి లేదని కానీ ఇప్పుడు చిన్నపంచాయతీ ఎన్నికల్లో దువ్వాడ వర్గం కత్తులు బ్యాట్లు తీసుకుని మరీ రోడ్లపై హల్‌చల్ చేయడం ఇవన్నీ పెద్ద ఎత్తున కొన్ని చానెళ్లలో ప్రసారం కావడంతో అధికార పార్టీలో ఇప్పటి వరకు కీలకంగా ఉన్న నాయకులు కూడా దువ్వాడ వైఖరిపై అసహనంతో ఉన్నారు ఏదైనా ఉంటే మాటల వరకే పరిమితం కావాలి.ఆ పంచాయతీలో ఎన్నో దశాబ్దాలుగా ఏకగ్రీవం అవుతోంది.ఈ విషయం తెలుసుకోకుండా స్పీడ్ పెంచితే ఏం చెబుతాం అని వైసీపీలోని కీలక నేత ఒకరు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇక, మంత్రి కూడా గతంలో దువ్వాడను ఇంటికి పిలిచి మాట్లాడేవారు.
ఇద్దరూ భుజంపై భుజం చేసుకుని సమస్యలపై చర్చించుకుని పార్టీని బలోపేతం చేశారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిది.
ఇప్పుడు సీదిరి అప్పలరాజు దువ్వాడను పక్కన పెడుతున్నారు.ఆయన వైఖరిపై అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు.
మున్ముందు దువ్వాడ పార్టీలో ఒంటరి అవుతారా? అనే సందేహాలు వస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.