వివాదాల వల్ల అనసూయ కెరీర్ కు నష్టమా.. కొత్త ఆఫర్లు రావడం కష్టమేనా?

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయను అభిమానించే అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో కొన్ని విషయాలకు సంబంధించి ఆమెను ట్రోల్ చేసేవాళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు.తాజాగా లైగర్ పై నెగిటివ్ కామెంట్లు చేసిన అనసూయ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు.

 Controversies Are Minus For Anasuya Cine Career Details, Anasuya, Anasuya Career-TeluguStop.com

గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు పెట్టుకుని అనసూయ లైగర్ సినిమాను టార్గెట్ చేశారు.అయితే అదే సమయంలో అనసూయకు నెటిజన్ల నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి.

నెటిజన్ల నెగిటివ్ కామెంట్లకు అనసూయ సమాధానమిస్తున్నా ఆమెపై నెగిటివిటీ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.అయితే వివాదాల వల్ల అనసూయ కెరీర్ కు నష్టమే తప్ప లాభం అయితే ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే అనసూయ జబర్దస్త్ షోకు దూరమయ్యారు.వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లే జబర్దస్త్ షోకు దూరమయ్యానని అనసూయ చెబుతున్నారు.

అయితే అనసూయను తమ సినిమాలలోకి తీసుకోవడం వల్ల సినిమాలు కూడా వివాదాలలో చిక్కుకునే ఛాన్స్ అయితే ఉందని దర్శకనిర్మాతలు భావించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Telugu Anasuya, Anasuya Career, Anasuya Liger, Anasuya Offers, Anchor Anasuya, C

బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్న అనసూయ వివాదాల వల్ల ఇండస్ట్రీకే దూరమయ్యే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు వేర్వేరు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచి ఇండస్ట్రీకి దూరమయ్యారు.

Telugu Anasuya, Anasuya Career, Anasuya Liger, Anasuya Offers, Anchor Anasuya, C

అనసూయ నెగిటివ్ వార్తల ద్వారా వార్తల్లో నిలవడం ఫ్యాన్స్ కు సైతం నచ్చడం లేదు.అభిమానులకోసమైనా అనసూయ ఈ విషయంలో మారాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.అనసూయ ఈ విషయంలో మారతారో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు అనసూయ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న అనసూయ కెరీర్ పరంగా తప్పటడుగులు వేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube