ఆరోగ్యానికి సిరి తులసి.. రోజుకు నాలుగు ఆకులను ఇలా తీసుకుంటే అదిరిపోయే లాభాలు!

మన భారత దేశంలో తులసిని అత్యంత పవిత్రమైన మొక్కగా భావిస్తారు.హిందువులు ఇంటి ముందు తులసి మొక్కను నాటి నిత్యం పూజ చేస్తారు.

తులసిలో విటమిన్ ఎ, విటమిన్ కె, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలతో పాటు మరెన్నో ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అందువల్ల ఆరోగ్యానికి తులసి సిరి అని చెప్పుకోవచ్చు.

రోజుకు నాలుగు తుల‌సి ఆకుల‌ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాట‌ర్‌ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక నాలుగు తులసి ఆకులు,( Tulsi Leaves ) చిటికెడు మిరియాల పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించి వడకట్టాలి.ఇప్పుడు ఈ వాటర్ లో స్వచ్ఛమైన తేనె( Honey ) కలిపి తీసుకోవాలి.

Advertisement

రోజు ఉదయం ఈ తులసి వాటర్ ని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జ‌రుగుతుంది.తులసి మీ శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.గుండె ఆరోగ్యానికి అండంగా ఉంటుంది.

తులసి, మిరియాలు, తేనె కాంబినేష‌న్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది.ముఖ్యంగా రోగ‌ నిరోధక శ‌క్తిని( Immunity Power ) బలపరుస్తుంది.జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలను వదిలిస్తుంది.

అలాగే పైన చెప్పిన విధంగా తుల‌సి వాట‌ర్ ను ( Tulsi Water ) త‌యారు చేసుకుని రెగ్యుల‌ర్ గా తాగితే కాలేయంలో కొవ్వు నిల్వలు త‌గ్గుతాయి.టాక్సిన్స్ తొల‌గిపోయి ర‌క్తం శుద్ధి అవుతుంది.

చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్... ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అశ్విని దత్!
పొగతాగితే 'డిప్రెషన్'లోకి వెళ్తారు.. మీకు తెలుసా?

డిప్రెష‌న్ తో బాధ‌ప‌డేవారికి ఈ తుల‌సి వాట‌ర్ న్యాచుర‌ల్ మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.తులసిలో అడాప్టోజెన్ అనే యాంటీ స్ట్రెస్ పదార్థం ఉంటుంది.ఇది ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌ను త‌రిమికొట్టి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.

Advertisement

శరీరంలో యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి.అయితే తులసి శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ కణాల వ్యాప్తి మరియు ఉత్పత్తిని త‌గ్గించ‌డంలోనూ తుల‌సి తోడ్ప‌డుతుంది.ఇప్పుడు చెప్పుకున్న తుల‌సి వాట‌ర్ ను రోజూ తాగితే చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్ మరియు కాలేయ క్యాన్సర్ వంటి వివిధ క్యాన్సర్ల రిస్క్ త‌గ్గుతుంది.

తాజా వార్తలు