హై ప్రోటీన్ ల‌డ్డు.. రోజుకొక‌టి తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

ప్రోటీన్‌.మ‌న శ‌రీరానికి కావాల్సిన ముఖ్య పోష‌కాల్లో ఒక‌టి.

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ప్ర‌తి రోజు మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ప్రోటీన్ ను అందించాలి.

కానీ, ఏయే ఫుడ్స్ ద్వారా పుష్క‌ల‌మైన ప్రోటీన్ ల‌భిస్తుందో తెలియక చాలా మంది తిక‌మ‌క ప‌డుతుంటారు.

అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే హై ప్రోటీన్ ల‌డ్డూను డైట్‌లో చేర్చుకుంటే స‌రి.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హై ప్రోటీన్ ల‌డ్డూను త‌యారు చేసుకోవ‌డం ఎలా.? అస‌లు దాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభాలు ఏంటీ.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక క‌ప్పు రోల్డ్ ఓట్స్ వేసి వేయించుకోవాలి.

ఓట్స్ మంచిగా ఫ్రై అయిన త‌రువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని.మ‌ళ్లీ అదే పాన్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించి పెట్టుకున్న ఓట్స్‌, నువ్వులు, గింజ తొల‌గించిన‌ ఎనిమిది ఖ‌ర్జూరాలు వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పీన‌ట్ బ‌ట‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని చిన్న చిన్న ల‌డ్డూల మాద‌రి చుట్టుకుని.

ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.ఈ హోం మేడ్ హై ప్రోటీన్ ల‌డ్డూను రోజుకు ఒకటి చ‌ప్పున ప్ర‌తి రోజు తీసుకుంటే శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ప్రోటీన్ ల‌భిస్తుంది.

అదే స‌మ‌యంలో వెయిట్ లాస్ అవుతారు.అతి ఆక‌లి దూరం అవుతుంది.నీర‌సం, అల‌స‌ట వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

బాడీ రోజంతా యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్ ప‌ని చేస్తుంది.ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ప‌రార్ అవుతుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

మ‌రియు మెద‌డు ప‌ని తీరు సైతం మున‌ప‌టి కంటే మెరుగ్గా ప‌ని చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు