తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మందిని బయటకు పంపించడానికి రేవంత్ రెడ్డి పన్నాగాలు పన్నుతున్నారు అని ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో తన ని కూడా పార్టీ నుండి … బయటకు పంపించడానికి చూస్తున్నారని విహెచ్ రేవంత్ రెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఎన్ని కుట్రలు పన్నినా గాని పార్టీ నుండి… నేను మాత్రం అసలు వెళ్ళను అని స్పష్టం చేశారు.
చచ్చిపోయినా కానీ.నా శవం పైన కాంగ్రెస్ పార్టీ జండానే కప్పాలని చెప్పుకొచ్చారు.
ఇక ఇదే టైములో పార్టీలో బీసీలకు అన్యాయం జరిగితే ఏఐసీసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తాను అని హెచ్చరించారు.కాగా ఏమ్మెల్సీ రాములు నాయక్.
కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని పేర్కొన్నారు.
అటువంటిది పార్టీలో ప్రేమ్ సాగర్ రావు దొరల వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.మంచిర్యాలలో జరిగిన అవమానం పార్టీ దృష్టికి తీసుకెళ్లినా గాని పట్టించుకోలేదని రాములు నాయక్ వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్లో బిసి .బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని విహెచ్ మరికొంతమంది మీడియా ముందు చేసిన తాజా కామెంట్స్ టీ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి.