షర్మిల పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధం ? రంగంలోకి డీకే

కర్ణాటక ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో ఉత్చాహం లో ఉన్న కాంగ్రెస్ ఎన్నికలు జరగబోతున్న మిగతా రాష్ట్రాలపై అదే విధంగా ఫోకస్ చేసింది.తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చేందుకు పావులు కలుపుతోంది .

 Congress Ready For An Alliance With Sharmila's Party Dk Into The Field , Ysrtp,-TeluguStop.com

బీఆర్ఎస్, బిజెపిలకు ధీటుగా కాంగ్రెస్( Congress party ) ను బలోపేతం చేసి, ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రధాన సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

దీనిలో భాగంగానే వైఎస్సార్ తెలంగాణ పార్టీ తో పొత్తు పెట్టుకునే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ షర్మిలకు మధ్య ఫోన్ ద్వారా మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది.

ఇక కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కారణమైన డీకే శివకుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దించింది .తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే విధంగా డీకే సేవలను ఉపయోగించుకోబోతుంది.దీనిలో భాగంగానే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన శివకుమార్ ద్వారా షర్మిలను పొత్తుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Congress, Dk Shivakumar, Karnataka, Pcc, Revanth Reddy, Telangana, Ts, Ys

ఇది ఒక రకంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి( Revanth Reddy ) ఇబ్బంది కలిగించే అంశమే.ఇప్పటికే కాంగ్రెస్ ను ఇతర పార్టీలో చేరిన నేతలను తిరిగి పార్టీలోకి రావాలంటూ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.అలాగే రేవంత్ రెడ్డి కారణంగా పార్టీకి దూరమయ్యమని చెబుతున్న నేతలను బుజ్జగించి మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చి యాక్టివ్ చేసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

దీనిలో భాగంగానే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ లో చేరే విధంగా ఒప్పించారట .వచ్చే వారంలో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.ఇప్పటికే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఆందోళనలు చేపడుతున్న వైఎస్ షర్మిల ప్రభావం కాస్తో కూస్తో రాబోయే ఎన్నికల్లో ఉంటుందని , ప్రధానంగా రెడ్డి , ఎస్సీ ఓటు బ్యాంకును షర్మిల చీల్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.రాబోయే ఎన్నికల్లో ఎస్సీ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కీలకం కాబోతున్న నేపథ్యంలో షర్మిల ను పొత్తుకు ఒప్పిస్తే ఇబ్బంది ఉండదని లెక్కలు కాంగ్రెస్ వేసుకుంటుంది.

అందుకే వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ( D.K.Shivakumar )ద్వారా షర్మిలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే తమకు ఢిల్లీ నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయని షర్మిల( Y.S.Sharmila ) ప్రకటించారు.

Telugu Congress, Dk Shivakumar, Karnataka, Pcc, Revanth Reddy, Telangana, Ts, Ys

 కాంగ్రెస్ తో పొత్తుకు షర్మిల ఆసక్తిగానే ఉన్నా, రేవంత్ రెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకుంటే బిఆర్ఎస్ కు  అస్త్రంగా మారుతుందని, అసలు తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నా,  అధిష్టానం మాత్రం ఈ విషయంలో రేవంత్ అభిప్రాయాలను పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube