ఈ ప్రపంచంలో అత్యధికంగా బాంబులు పడిన దేశం ఒకటుంది తెలుసా?

ఈ ప్రపంచంలో లావోస్( Laos ) అత్యంత ఎక్కువగా బాంబు దాడులకు ఛిద్రమైన దేశం అని ఆ దేశ ఎంఏజీ (మైన్స్ అడ్వైజరీ గ్రూప్) డైరెక్టర్ అయినటువంటి పోర్టియా స్ట్రాటన్ తాజాగా ఓ ప్రకటన చేయడంతో హాట్ టాపిక్ గా మారింది.నిజమే, కానీ వియత్నాం యుద్ధంలో( Vietnam ) భాగంగా దాని వినాశనం జరిగింది.

 Do You Know Most Bombed Country In The World Laos Details, Viral Latest, News Vi-TeluguStop.com

ఎంఏజీ( Mines Advisory Group ) ఒక ఎన్‌జీవో సంస్థ.ఈ సంస్థ ఇప్పటికీ అక్కడ మైన్స్ కనుగొనడం, వెలికితీయడం, ధ్వంసం చేయడం వంటి పనులను నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో భయంకరమైన విషయాలను చెప్పుకొచ్చింది ఈ సంస్థ.

Telugu America, Bombs, Laos, Advisory, Bombed, Peoples, Vietnam, Vietnam War, La

ఇక ఈ దాడులు చేసింది అమెరికా ( America ) అన్న సంగతి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వియత్నాం యుద్ధం నుంచి అమెరికా వైదొలిగి లావోస్‌పై బాంబు దాడులను నిలిపివేసి 50 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ దేశంలో అమెరికా ప్రయోగించిన బాంబులను( Bombs ) వెతికి బయటకు తీసి నిర్వీర్యం చేయడం జరుగుతోంది అంటే అర్ధం చేసుకోవచ్చు, అమెరికా దుశ్చర్య.ఎంఏజీ సంస్థ ప్రకారం… 5,80,000 మంది అమెరికా సైనికులు 1964 నుంచి 1973 వరకు లావోస్ పైన 20 లక్షల టన్నుల కంటే ఎక్కువ పరిమాణంలో ఆయుధాలు ప్రయోగించారని సమాచారం.

ఇలా 9 సంవత్సరాల పాటు 24 గంటలూ వేయగా వీటిలో 30 శాతం పేలలేదు అని చెబుతున్నారు.

Telugu America, Bombs, Laos, Advisory, Bombed, Peoples, Vietnam, Vietnam War, La

అందుకే లావోస్‌ భూభాగంలో ఇప్పటికీ పేలని బాంబులు, గ్రెనేడ్లు ఉన్నాయి.ఇన్నేళ్లూ ఆ దేశం అలాంటి పరిస్థితులమధ్య ఎలా జీవిస్తుందో అని ప్రపంచదేశాలు విస్తుపోవడం గమనార్హం.కాగా లావోస్‌ అంతర్యుద్ధం 1975లో ముగిసిన తరువాత దేశం పాథెట్ లావో (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) చేతిలోకి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి ఇది ఒకే పార్టీ నియంత్రణలోని కమ్యూనిస్ట్ రాజ్యంగా ఉంది.చాలా సంవత్సరాలుగా మిగిలిన ప్రపంచంతో లావోస్‌కు సంబంధాలు తెగిపోయాయి.తద్వారా ఎంఏజీ వంటి మందుపాతర నిర్మూలన ఎన్‌జీవోలను 1994 వరకు దేశంలోకి అనుమతించలేదు.అప్పటికే ఈ ప్రమాదకరమైన పేలని పదార్థాల కారణంగా అక్కడ 10 వేల మంది మరణించినట్టు అంచనా.

యుద్ధం ముగిసిన 5 దశాబ్ధాల తర్వాత కూడా ఈ పేలుడు పదార్థాలను నాశనం చేసే పనులు అక్కడ కొనసాగడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube