విజయవాడ: సజ్జల వాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ రియాక్షన్.అధికారం కోల్పోతున్నామని భయంతో సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారు.
జగన్ అధికార దాహంతో గత ఎన్నికల సమయంలో రాజశేఖర్ రెడ్డి మరణాన్ని వాడుకుని ప్రజల ముందుకు వచ్చాడు.తప్పుడు ప్రచారాలు చేసి అసత్యాలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేశాడు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం పై అనుమానాలు ఉంటే అధికారంలో ఉన్న నాలుగున్నర సంవత్సరాలుగా ఏం పీకారు? విచారణ ఎందుకు చేయలేదు?షర్మిల కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని గౌరవించి పార్టీలోకి వచ్చింది.రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆఖరి కోరిక అనే విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు వచ్చింది.
షర్మిలను చూసి వైఎస్ఆర్సిపి నాయకులు, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు.
ఒక్క ఛాన్స్ అంటే రాష్ట్ర ప్రజలు జగన్కు అవకాశం ఇచ్చారు.
ఇప్పుడు ఎందుకు అవకాశం ఇచ్చామని పరిచరంతా చెప్పుతో కొట్టుకుంటున్నారు.జగన్ పాలనను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో మరోసారి కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని వాడుకుని అధికారంలోకి వచ్చేందుకు జగన్, సజ్జల చూస్తున్నారు.రిలయన్స్ సంస్థతో కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ సంస్థలో పనిచేస్తున్న నటవాని కి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా కట్టబెట్టలేదా?కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడానికి వైయస్సార్సీపి నాయకులకు సిగ్గుండాలి.రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పాలన రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.వైయస్సార్ సిపి అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచన ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పారు.
కేసులకు భయపడి జైల్లోకి వెళ్లాల్సి వస్తుందని బిజెపితో లోపాయి కారి ఒప్పందం పెట్టుకుని , రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ కేంద్రం ముందు జగన్ మోకరిల్లుతున్నాడు.రాష్ట్రంలో భూకబ్జాలు దోపిడీతో ప్రజలను వైఎస్ఆర్సిపి నాయకులు హింసిస్తున్నారు.
ప్రతిపక్షాలపై కుట్రలు పన్ని, ఆక్రమి కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు.వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట చెప్పి మడమ తిప్పాడు.
రాజధాని రైతులను రోడ్డున పడేసి వారిపై అక్రమ కేసులు పెట్టించాడు.రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేశాడు.
రాజశేఖర్ రెడ్డి కళ పోలవరం ప్రాజెక్టును కూడా నేటికీ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోయాడు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేస్తుంటే బిజెపితో జతకట్టి జగన్ చూస్తుండిపోయాడు.
రాష్ట్రానికి కొత్త పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు.తమ ఆస్తులు కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడో అని పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు.పరిశ్రమలు రాకపోవడంతో యువత నిరుద్యోగులై పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు.జగన్ అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేసిన చెల్లిని కనీసం పట్టించు కావడం లేదు.
షర్మిల పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకుంటే సజ్జలతో జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడించాడు.ప్రజాసేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే ఆమెను చూసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు భయపడుతున్నారు.
అందుకే మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైయస్సార్ మరణాన్ని వాడుకుని కాంగ్రెస్ పార్టీపై బురద చల్లేందుకు చూస్తున్నారు.
వైయస్సార్సీపి నాయకులు కాంగ్రెస్ని గాని గాంధీ కుటుంబాన్ని గాని విమర్శిస్తే ఊరుకునేది లేదు.
ఎన్ని విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు లాగా టిడిపి నేతలు లాగా చూస్తూ ఊరుకోము.తప్పుడు ప్రచారం చేస్తే ఇంటికొచ్చి మరి కొడతామని జగన్ గుర్తుంచుకోవాలి.వైయస్సార్ పేరు జగన్ సర్వనాశనం చేశాడు.లక్షల కోట్లు దోచుకున్నందుకే జగన్ పై ఈడీ కేసులు ఉన్నాయి.
రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు నిజమేనా వారసులు కాంగ్రెస్ వాదులే.రాజశేఖర్ రెడ్డి ఆస్తులకే జగన్మోహన్ రెడ్డి వారసుడు.
అంగన్వాడీలకు పక్క రాష్ట్రంల కంటే ఒక వెయ్యి రూపాయలు వేతనం ఎక్కువగా ఇస్తానని చెప్పి మాట తప్పి వారిని బాధపెడుతున్నాడు.