తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో వలసలు, రైతు బలవన్మరణాలకు కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సుమారు 6.5 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చామని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులన్నీ పెండింగ్ లోనే ఉండేవని ఆరోపించారు.కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మహబూబ్ నగర్ జిల్లాను విద్యలో అగ్రగామిగా నిలబెట్టామని చెప్పారు.విద్య, వైద్యంను అందుబాటులోకి తెచ్చింది బీఆర్ఎస్సేనని హరీశ్ రావు స్పష్టం చేశారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) భాష సరిగా లేదన్న ఆయన మాట తీరును మార్చుకోవాలని సూచించారు.