తెలంగాణలో కాంగ్రెస్ ( Telangana Congress )దశ తిరిగినట్లుగానే కనిపిస్తుంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో ఫలితాలపైనే ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే అనేక సర్వే సంస్థలు, ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలవబోతున్నట్లుగా హడావుడి చేస్తున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో అధికారంలోకి వస్తున్నామనే ఉత్సాహం కనిపిస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ఈనెల తొమ్మిదో తేదీన క్యాబినెట్ తొలి సమావేశం నిర్వహించబోతున్నామంటూ ప్రకటన కూడా చేసేసారు.అయితే బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో గెలుపు ధీమాతో ఉంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఎవరూ నమ్మ వద్దని, కచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్( KTR ) వంటి వారు చెప్తున్నారు.ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ,కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా పోరు నెలకొంది.
అయితే తెలంగాణ లో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటి ఉండగా, బిజెపి మూడో స్థానానికే పరిమితం అయినట్లుగా పరిస్థితి ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ తొలిసారిగా అధికారంలోకి రాబోతున్నట్టుగా వివిధ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలుపడ్డాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఈరోజు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ప్రకటించనుంది.ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా తో పాటు టైమ్స్ నౌ ఈ టీజీ, ఇండియా టీవీ – సి ఎన్ ఎక్స్, టుడేస్ చాణిక్య కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రాబోతున్నట్లు ప్రకటించాయి.
అయితే తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైఫై మగ్గుచూపుతున్న పోలింగ్ సరళి మాత్రం ఎవరికీ అందు పట్టడం లేదు.ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ తెలంగాణ పోలీస్ తీరును అంచనా వేయలేకపోయింది .

ఎన్నికల్లో ఎక్కువ ధన ప్రవాహం ఉండడం సాయంత్రం పోలింగ్ సమయం ముగిసిన ఓటర్లు క్యూ లైన్ లో నిలబడడం ఇవన్నీ కారణంగా ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా చెబుతోంది కాంగ్రెస్ ఉంది అప్పుడే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇక ముఖ్యమంత్రి పదవి విషయం పైన సీనియర్ నేతలు అధిష్టానం అప్పుడే ఒత్తిడి మొదలు పెట్టేసారట
.