అలంపూర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.మళ్లీ అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను గిరిజనులుగా ప్రకటిస్తామని తెలిపారు.
బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్ పార్టీనేనని కేసీఆర్ పేర్కొన్నారు.గతంలో పాలమూరు నుంచి అధికంగా వలసలు ఉండేవన్నారు.
ప్రస్తుతం పాలమూరులో పరిస్థితులను ప్రజలు గుర్తించాలని చెప్పారు.అలంపూర్ లో కరువు అనేది లేకుండా చూస్తామన్న కేసీఆర్ ఆర్డీఎస్ కాలువల్లో పూడికతీత పనులకు రూ.13 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు.ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులు తప్ప ఏం లేవని విమర్శించారు.
కాంగ్రెస్ పేదలను పట్టించుకోలేదని, తెలంగాణ బతుకును నాశనం చేశారని ఆరోపించారు.బీఆర్ఎస్ వచ్చాక కాంగ్రెస్ చేసిన అన్యాయాలను సరిదిద్దుకున్నామని తెలిపారు.