తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..: ఎంపీ ఉత్తమ్ కుమార్

ఏఐసీసీ, పీసీసీ ఎన్నికల కమిటీల ఆమోదంతో తాను హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు పైగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు 12 సీట్లు గెలుస్తామని చెప్పారు.కోదాడ, హుజూర్ నగర్ లో సుమారు యాభై వేల మెజారిటీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ 119 నియోజకవర్గాల్లో ముదిరాజ్ లకు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదని తెలిపారు.అదేవిధంగా మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం లేదన్నారు.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని మండిపడ్డారు.బీఆర్ఎస్, బీజేపీది రాష్ట్రంలో కుస్తీ అన్న ఆయన కేంద్రంలో దోస్తీ అని ఎద్దేవా చేశారు.

Advertisement
ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు