తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో బీజేపీ నిర్వహిస్తున్న విజయసంకల్ప సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నిరుద్యోగ భృతి ఎక్కడకు పోయిందని తెలంగాణ యువత ప్రశ్నిస్తోందన్న కిషన్ రెడ్డి( Kishan Reddy ) రైతుబంధు ఎక్కడకు పోయిందని తెలంగాణ రైతులు( Farmers ) ప్రశ్నిస్తున్నారని చెప్పారు.
గారడీల పేరుతో ప్రజలను మభ్య పెట్టి కాంగ్రెస్ ( Congress )అధికారంలోకి వచ్చిందన్నారు.
గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు.







