ఇక కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ ఏపీ పైనే?

అనేక సమాలోచనలు, వ్యూహాత్మక కమిటీల నిర్ణయాల తర్వాత తెలంగాణను ప్రకటించిన కాంగ్రెస్ ( Congress )రెండు రాష్ట్రాలలోనూ నష్టపోయింది.అటు తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ను కెసిఆర్ ( CM kcr )దక్కించుకోగా, ఇటు రాజధాని లేకుండా చేశారనే కోపం సీమాంధ్రలో కాంగ్రెస్ ను భూస్థాపితం చేసింది అయితే రాజధాని లేని లోటును పూడ్చడానికి ప్రత్యేక హోదా పేరిట కొన్ని ఏర్పాట్లు జరిగినా దానిని విభజన చట్టంలో అధికారికంగా చేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ఆంధ్రుల ఉసురు పోసుకుందనే చెప్పవచ్చు.

 Congress Full Focus On Ap , Congress Party , Brs , Telangana Election, Priyan-TeluguStop.com
Telugu Congress, Priyanka Gandhi, Telangana-Telugu Top Posts

అయితే రాజ్యసభలో సాక్షాత్తు ప్రధానమంత్రి చేత ప్రకటింపజేసినా కూడా దానికి విలువ లేనట్టుగా తీసేయటం భాజపా బాధ్యతరాహిత్యం కాగా , ప్రధాన విలన్ గా మాత్రం కాంగ్రెస్ గుర్తుంచబడుతుంది.ఇంతకాలం దానికి తగిన మూల్యం చెల్లించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్లో జవసత్వాలు కూడగట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది .ముఖ్యంగా పాత గాయాలను ఆంధ్రులు మరిచిపోయారని బావిస్తున్నారో లేక తమకు మరోసారి అవకాశం దక్కడానికి అవసరమైన పరిస్థితులు ఉన్నాయని బావిస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల( Telangana election ) ప్రక్రియ ముగియగానే కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆంధ్ర ప్రదేశ్ పై దృష్టిపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Telugu Congress, Priyanka Gandhi, Telangana-Telugu Top Posts

ముఖ్యంగా అమరావతి కేంద్రంగా కాంగ్రెస్ రాజకీయాలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.అధికార వైసిపి ( YCP )మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న అమరావతి ఉద్యమానికి మద్దతు తెలుపుతూ భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయాలని దానికి ప్రియాంక గాంధీని( Priyanka Gandhi ) రప్పించాలని కాంగ్రెస్ ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు ప్లాన్ చేస్తున్నారట.అవసరమైతే షర్మిలా తోడ్పాటు కూడా తీసుకోవాలని వివిద కారణాలతో పార్టీని వీడిన కీలక నాయకులను తిరిగి ఆక్టివ్ చేయాలని కాంగ్రెస్ కి పునర్ వైభవం దిశగా గట్టిగా కృషి చేయాలన్నది కాంగ్రెస్ అధిష్టానం బావన అట .నిజానికి కాంగ్రెస్ అత్యంత నమ్మకమైన ఓట్ బ్యాంక్ గా ఉన్న తెలుగు రాష్ట్రాలను వ్యూహాత్మక వైఫ్యల్యాలతో కాంగ్రెస్ పోగొట్టుకుంది .మరో సారి ఆ పట్టు కోసం కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టుగా తెలుస్తుంది .మరి కాంగ్రెస్ కోరికను ఆంధ్రులు మన్నిస్తారో లేదో చూడాలి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube